చట్టవిరుద్ధమైన డాగ్‌ఫైటింగ్ కోసం కొందరు భారతదేశంలోకి కొన్ని డాగ్ బ్రీడ్స్ ను తీసుకుని వస్తున్నారు

కొన్ని విదేశీ కుక్కల జాతులను అమ్మడం, పెంపకం, ఉంచడాన్ని నిషేధించాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు బుధవారం లేఖ రాసింది. ప్రమాదకరమైన జాబితాలో ఉన్న కుక్కలైన పిట్ బుల్స్, ఇతర జాతుల అమ్మకం, పెంపకం, ఉంచడం కోసం ఎటువంటి లైసెన్సులు లేదా అనుమతులు జారీ చేయబడకుండా చూసుకోవాలని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఇప్పటికే ప్రజల వద్ద ఉన్న ఈ పెంపుడు కుక్కలకు సంతానోత్పత్తి జరగకుండా స్టెరిలైజ్‌ చేయాలని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ ఈ నెల 12న లేఖలు రాసింది. పశుసంవర్ధక కమిషనర్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీ, అటువంటి కుక్కల జాతుల దిగుమతిని నిషేధించాలని సిఫార్సు చేసింది.

చట్టవిరుద్ధమైన డాగ్‌ఫైటింగ్ కోసం కొందరు భారతదేశంలోకి కొన్ని డాగ్ బ్రీడ్స్ ను తీసుకుని వస్తున్నారు. ఇక వాటిని భారీ గొలుసులతో కట్టేసి హింసిస్తూ వస్తున్నారు. దేశంలోని అనేక ప్రాంతాలలో పిట్ బుల్స్, ఇతర కుక్కల జాతుల ద్వారా దాడులు కూడా జరిగాయనే వార్తలు గతంలో చాలానే వచ్చాయి. నిషేధించాలని సిఫార్సు చేసిన కుక్కలలో పిట్ బుల్ టెర్రియర్లు, టోసా ఇను, అమెరికన్ స్టాఫోర్డ్‌షైర్ టెర్రియర్, ఫిలా బ్రసిలెరియో, డోగో అర్జెంటీనో, అమెరికన్ బుల్‌డాగ్, బోయర్‌బోయెల్, కంగల్, వివిధ షెపర్డ్ డాగ్‌లు, టోర్న్‌జాక్, బాండోగ్, సర్ప్లానినాక్, జపనీస్ తోసా, అకిటా, మాస్టిఫ్స్, రోట్‌వీలర్స్, రోడేసియన్ రిడ్జ్‌బ్యాక్, వూల్ఫ్ డాగ్స్, కానారియో, అక్బాష్, మాస్కో గార్డ్‌డాగ్ వంటివి ఉన్నాయి.

Updated On 13 March 2024 10:06 PM GMT
Yagnik

Yagnik

Next Story