ప్రస్తుతం ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’(One Nation One Election) అనే అంశంపై దేశంలో చర్చ నడుస్తోంది. 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' అనే అంశంపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ramnath Kovindh) అధ్యక్షతన 8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' కమిటీ మొదటి అధికారిక సమావేశం

Ramnath Kovindh
ప్రస్తుతం ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’(One Nation One Election) అనే అంశంపై దేశంలో చర్చ నడుస్తోంది. 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' అనే అంశంపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ramnath Kovindh) అధ్యక్షతన 8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' కమిటీ మొదటి అధికారిక సమావేశం ఈ రోజు ఢిల్లీలో(Delhi) జరిగే అవకాశం ఉందని ప్రముఖ వార్తా సంస్థ ఎఎన్ఐ(ANI) సంస్థ నివేదిక పేర్కొంది. కొద్ది రోజుల క్రితం రామ్‌నాథ్ కోవింద్ న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రామ్‌నాథ్ కోవింద్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది.
కమిటీలో మొత్తం 8 మంది ఉన్నారు. ఇందులో అమిత్ షా, అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, ఎన్‌కె సింగ్, సుభాష్ కశ్యప్, హరీష్ సాల్వే, సంజయ్ కొఠారీ ఇతర సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ నుంచి తన పేరును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేయడం గమనార్హం. వన్ నేషన్, వన్ ఎలక్షన్ నిర్వహించడం వెనుక ఎన్నికల కోసం వెచ్చించే కోట్లాది రూపాయలు ఆదా అవుతాయనేది కేంద్ర ప్రభుత్వ వాదన.
ఒక దేశం, ఒకే ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ చాలాసార్లు చర్చించడం గమనార్హం. నవంబర్ 2020లో ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో ప్రసంగిస్తూ.. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనేది చర్చకు సంబంధించిన అంశం మాత్రమే కాదని.. భారతదేశానికి అవసరమని అన్నారు. భారతదేశంలో ప్రతి నెలా ఎన్నికలు జరుగుతున్నాయని.. దీని వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతోందన్నారు. దేశం అంత డబ్బు వృధా చేయకూడదని అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
