రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక 90 రూపాయల నాణాన్ని తయారు చేసింది. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi) ఈ ప్రత్యేక నాణాన్ని(Coin) విడుదల చేశారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక 90 రూపాయల నాణాన్ని తయారు చేసింది. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi) ఈ ప్రత్యేక నాణాన్ని(Coin) విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ తదితరులు పాల్గొన్నారు. 90 రూపాయల నాణాన్ని 99.99 శాతం స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు. 40 గ్రామలు బరువున్న ఈ నాణానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే ఇది ప్రజల వినియోగానికి మాత్రం అందుబాటులో ఉండదు. ఏప్రిల్‌ 1, 1935న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అమలులోకి వచ్చింది. బ్రిటిష్‌ పాలనలో హిల్టన్‌ యంగ్‌ కమిషన్‌ సిఫార్సుల ఆధారంగా ఆర్‌బీఐను ఏర్పాటు చేశారు. ఆర్థిక స్థిరత్వానికి అవసరమైన రిజర్వ్ ఫండ్ ఏర్పాటు, బ్యాంకు నోట్లు, నాణేలు మొదలైన వాటికి రిజర్వ్ బ్యాంక్ బాధ్యత వహిస్తుంది. ఏ దేశానికైనా రిజర్వ్ బ్యాంక్ కేంద్ర బ్యాంకు. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ లాగా భారత్‌కు ఆర్‌బీఐ ఉంది.

Updated On 2 April 2024 2:45 AM GMT
Ehatv

Ehatv

Next Story