ఓ ఫుట్‌పాత్‌పై (FootPath)మహిళ, తన కూతురు నడుచుకుంటూ వెళ్తుండగా చిన్నారిని కరిచేందుకు (Byte) ఓ కుక్క (Street Dog) ప్రయత్నించింది. కుక్క దాడిని గమనించి తల్లి క్షణాల్లో పాపను తన భుజాలపైకి ఎత్తుకుంది. అయినా ఆ కుక్క వదల్లేదు.. చిత్తకార్తి కుక్కలా, పిచ్చి కుక్కలా చిన్నారిపై విరుచుకుపడింది

ఓ ఫుట్‌పాత్‌పై (FootPath)మహిళ, తన కూతురు నడుచుకుంటూ వెళ్తుండగా చిన్నారిని కరిచేందుకు (Byte) ఓ కుక్క (Street Dog) ప్రయత్నించింది. కుక్క దాడిని గమనించి తల్లి క్షణాల్లో పాపను తన భుజాలపైకి ఎత్తుకుంది. అయినా ఆ కుక్క వదల్లేదు.. చిత్తకార్తి కుక్కలా, పిచ్చి కుక్కలా చిన్నారిపై విరుచుకుపడింది. చిన్నారిని కరిచేందుకు తల్లిపైకి ఎగబడింది. ఆమె ఎంత గద్దించినా కుక్క మాత్రం తన పగను తీర్చుకునేందుకే ప్రయత్నించింది. మహిళపైకి ఎగురుతూ పాపను కరిచేందుకు విశ్య ప్రయత్నం చేసింది. ఎంత సేపు ప్రయత్నించినా తల్లి మాత్రం తన పట్టు విడవలేదు. కూతురును కాపాడే క్రమంలో ఇద్దరూ కిందపడినా మళ్లీ లేచి కుక్కను తరిమేందుకు ప్రయత్నించింది. అటుగా వెళ్తున్నవారెవరూ వీరిని కాపాడేందుకు ప్రయత్నించలేదు. చివరకు ఓ వాహనదారుడు వచ్చి కుక్కను తరిమేసి తల్లీ, కూతురును రక్షించాడు. ఒళ్లు గగుర్పొడే ఈ వీడియో చూస్తే మీరూ భయపడక మానరు. చివరికి తల్లి ప్రేమ ముందు ఈ పిచ్చి కుక్కనే ఓడిపోయింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. సోషల్‌ మీడియాలో (Social Media) ఇది వైరల్‌గా మారింది. పిల్లలను వెంటపెట్టుకుని బయటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Updated On 3 Jan 2024 12:08 AM GMT
Ehatv

Ehatv

Next Story