ఉత్తరప్రదేశ్‌లోని(Uttar pradesh) అమేథి(Amethi) నియోజకవర్గంపైనే అందరి దృష్టి ఉంది. రాహుల్‌గాంధీ(Rahul gandhi) అక్కడి నుంచి పోటీ చేయడానికి విముఖత చూపడంతో గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీలాల్ శర్మను(Kishorilal sharma) బరిలో దించింది కాంగ్రెస్ పార్టీ(congress). పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని(Uttar pradesh) అమేథి(Amethi) నియోజకవర్గంపైనే అందరి దృష్టి ఉంది. రాహుల్‌గాంధీ(Rahul gandhi) అక్కడి నుంచి పోటీ చేయడానికి విముఖత చూపడంతో గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీలాల్ శర్మను(Kishorilal sharma) బరిలో దించింది కాంగ్రెస్ పార్టీ(congress). పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. అయితే ఆదివారం అర్థరాత్రిసమయంలో కొందరు దుండగులు కార్యాలయంపై దాడికి దిగారు. ఆఫీసు ఆవరణలో పార్క్ చేసిన కార్లను(Cars) పూర్తిగా ధ్వంసం చేశారు. పదికి పైగా కార్లను ధ్వంసం చేసి ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ఆవరణలోని సీసీకెమెరాల ఆధారంగా దుండగులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఈ దాడి విషయాన్ని కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా తెలియచేసింది. ఈ దాడి ముమ్మాటికి బీజేపీ పనేనని ఆరోపించింది. ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదని తెలిపింది.