ఒకే దేశం- ఒకే ఎన్నికలు అన్నది నరేంద్రమోదీ(Narendra Modi) నేతృత్వంలోని బీజేపీ(BJP) లక్ష్యం. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడం వెనుక కేంద్రం ఆలోచన కూడా ఇదేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నిక(Elections) జరపడం సాధ్యమేనా? అన్నది చాలా మందికి వస్తున్న సందేహం.

ఒకే దేశం- ఒకే ఎన్నికలు అన్నది నరేంద్రమోదీ(Narendra Modi) నేతృత్వంలోని బీజేపీ(BJP) లక్ష్యం. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడం వెనుక కేంద్రం ఆలోచన కూడా ఇదేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నిక(Elections) జరపడం సాధ్యమేనా? అన్నది చాలా మందికి వస్తున్న సందేహం. నిజానికి కేంద్రానికి కూడా ఇలాంటి అనుమానమే తలెత్తింది. అందుకే సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింగ్‌(Ramnath kovindh) నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పార్లమెంట్‌కు, అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి.

సెప్టెంబర్‌ 18 నుంచి 22వ తేదీ వరకు జరిగే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలలో ఒకే దేశం- ఒకే ఎన్నికలు బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. బిల్లు ప్రవేశపెట్టినా అది పాస్‌ కావడం కష్టమేనంటున్నారు విశ్లేషకులు. బిల్లు పాస్ కావాలంటే రాజ్యాంగ సవరణలను చేయాల్సి ఉంటుంది. ఈ సవరణలనకు లోక్‌సభలోని(Lok Sabha) 543 సభ్యులలో కనీసం 67 శాతం సభ్యులు అనుకూలంగా ఓటు వేయాలి. రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం ఈ బిల్లును సమర్థించాలి. దీనికి తోడు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి ఆమోద ముద్ర వేయాలి.

అంటే 14 రాష్ట్రాలు ఈ బిల్లును సమర్థించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీజేపీ(BJP) పాలిత రాష్ట్రాలు పది ఉన్నాయి. బీజేపీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాలు మరో ఆరు రాష్ట్రాలలో ఉన్నాయి. లోక్‌సభలో ఎన్టీయే(NTA) కూటమికి 333 మంది సభ్యులు ఉన్నారు. అంటే 61 శాతం సభ్యులు ఉన్నారన్నమాట! బిల్లు పాస్‌ అవ్వాలంటే మరో అయిదు శాతం సభ్యుల మద్దతు కావాలి. ఇది ఎలాగోలా సంపాదించుకుంటుందనుకున్నా రాజ్యసభలో ఎన్టీయేకు 38 శాతం మంది సభ్యులే ఉన్నారు.

కాబట్టి రాజ్యసభలో(Rajya sabha) ఈ బిల్లు పాసవ్వడం చాలా కష్టం. అసలు నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ఎందుకంత పట్టుదలతో ఉన్నది అంటే సమాధానం చాలా ఈజీ! ఓకేసారి లోక్‌సభకు, అసెంబ్లీలకు ఎన్నికలు జరిగే ప్రాంతీయ పార్టీల హవా తగ్గుతుందన్నది బీజేపీ ఆలోచన! నిగూఢ కారణం ఇదే అయినప్పటికీ ఖర్చు తగ్గించుకోవచ్చని బీజేపీ అంటోంది. 2019 లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందట! అదే సమయంలో ఒక్కో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వం 250 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయల వరకు వెచ్చించింది. ఇది అధికారిక ఖర్చు.

ఇక రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చుకు లేక్కే లేదు. అవి కూడా కూడితే మనకు మూర్ఛ రావడం ఖాయం. ఎన్నికల వ్యయాన్ని తగ్గించుకోవడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థంగా ఉపయోగించుకోవచ్చు. సాధారణ అధికారులు ఎన్నికల విధుల్లో ఉంటే పాలన మందగిస్తుంది. అందుకే కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ఖర్చు తగ్గుతుంది. సమయ ఆదా అవుతుంది. పాలనపై అధికారులు దృష్టి సారించే వీలు కూడా కలుగుతుంది.

ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి ఎన్నికల కోడ్‌తో ఎక్కువ సార్లు అడ్డంకులు కలిగే అవకాశాలు తగ్గుతాయి. జమిలీ ఎన్నికల కారణంగా పోలింగ్‌ శాతం పెరుగుతుందని లా కమిషన్‌ అంటోంది. 1967 వరకు దేశంలో అటు లోక్‌సభ ఎన్నికలు, ఇటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఓకేసారి జరిగాయి. తర్వాత కన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు కావడం, 1970లో ఏడాది ముందుగానే లోక్‌సభ రద్దు కావడం వంటి పరిణామాలతో జమిలి ఎన్నికలకు తెరపడింది.

1983లో ఎన్నికల కమిషన్‌(Election Commission) మరోసారి జమిలీ ఎన్నికల ప్రతిపాదన తెరపైకి తెచ్చినప్పటికీ ప్రభుత్వం పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. 1999లో లా కమిషన్‌ నివేదిక దీనిని మరోసారి లేవనెత్తింది. 2016లో ప్రధాని మోదీ ఈ ఆలోచనను మరోసారి ప్రతిపాదించారు. ఆ మరుసటి ఏడాదే దీనిపై నీతి ఆయోగ్‌ కసరత్తు చేసింది. 2019లో ఈ అంశంపై ప్రధాని వివిధ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేయగా.. కాంగ్రెస్‌ సహా చాలా పక్షాలు దీనికి దూరంగా ఉన్నాయి. అతికొద్ది పార్టీలు మాత్రమే ప్రతినిధులను పంపాయి.

Updated On 1 Sep 2023 7:53 AM GMT
Ehatv

Ehatv

Next Story