Bhajanlal Sharma : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ
రాజస్థాన్(Rajasthan) కొత్త ముఖ్యమంత్రిగా(CM) భజన్ లాల్ శర్మ (Bhajanlal Sharma)నియమితులయ్యారు. సంగనేర్(Sanganer) స్థానం నుంచి శర్మ తొలిసారి ఎమ్మెల్యేగా(MLA) గెలిచారు. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ(BJLP) సమావేశంలో భజన్ లాల్ శర్మ పేరును ఏకగ్రీవంగా ఆమోదించారు. జాక్‌పాట్(Jackpot) తగలడంతో ఏకంగా రాజస్థాన్‌కు సీఎం అయ్యారు. భజన్ లాల్ శర్మ పేరును మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే(Vasundhara Raje) ప్రతిపాదించారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ప్రేమ్ చంద్ బైర్వా(Prem chand bairwa), దియా కుమారి(Diya kumari) పేర్లను ఆమోదించారు. స్పీకర్‌గా వాసుదేవ్ దేవ్‌నానీ(Vasudev devnani) పేరు ఖరారైంది.

గతంలో ఢిల్లీలో(Delhi) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో(JP Nadda) మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే భేటీ అయ్యారు. ఎన్నికలలో విజయం తర్వాత వసుంధర చాలా మంది పార్టీ ఎమ్మెల్యేలకు డిన్నర్(Dinner) పార్టీ ఇచ్చారు. అయితే.. నడ్డాను కలిసిన తర్వాత వసుంధర స్వరంలో మార్పు వచ్చింది.. ఆ తర్వాత తనను తాను పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అభివర్ణించుకున్నారు.
ఆ తర్వాత రాష్ట్రానికి పార్టీ పరిశీలకులను(Party Observers) నియమించింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠకు స్వస్తి పలికి.. శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు అందరి ఆమోదం పొందే బాధ్యతను పరిశీలకులకు అప్పగించారు. దీంతో మంగళవారం(Tuesday) జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో భజన్‌లాల్ శర్మను ఎన్నుకున్నారు.