Women's Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లు.. లోక్‌సభలో మహిళా ఎంపీల సంఖ్య ఎంతకు పెరుగుతుందంటే..
కొత్త పార్లమెంట్ హౌస్(Parliament House) లో తొలిరోజు కార్యక్రమాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై(Women's Reservation Bill) చర్చ జరిగింది. ప్రధాని మోదీ(PM Modi) తన ప్రసంగంలో మహిళా రిజర్వేషన్ బిల్లును గట్టిగా సమర్థించారు. ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో బిల్లు (నారీ శక్తి వందన్ చట్టం) ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఉభయ సభలు ఆమోదించిన తర్వాత.. లోక్‌సభలో మహిళా ఎంపీల సంఖ్య 181కి పెరుగుతుందని బిల్లును సమర్పిస్తూ ఆయన చెప్పారు. లోక్‌సభలో ప్రస్తుతం 82 మంది మహిళా ఎంపీలు ఉన్నారు.
కొత్త పార్లమెంట్ హౌస్(Parliament House) లో తొలిరోజు కార్యక్రమాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై(Women's Reservation Bill) చర్చ జరిగింది. ప్రధాని మోదీ(PM Modi) తన ప్రసంగంలో మహిళా రిజర్వేషన్ బిల్లును గట్టిగా సమర్థించారు. ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో బిల్లు (నారీ శక్తి వందన్ చట్టం) ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఉభయ సభలు ఆమోదించిన తర్వాత.. లోక్‌సభలో(Lok Sabha) మహిళా ఎంపీల సంఖ్య 181కి పెరుగుతుందని బిల్లును సమర్పిస్తూ ఆయన చెప్పారు. లోక్‌సభలో ప్రస్తుతం 82 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. దిగువ సభలో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని తెలిపారు. విపక్షాలను ఉద్దేశించి మేఘ్వాల్.. బిల్లును ఉద్దేశపూర్వకంగా ఆమోదించలేదని అన్నారు. మహిళా రిజర్వేషన్ కాలపరిమితి 15 ఏళ్లు అని పేర్కొన్నారు.
ఈ బిల్లుకు సంబంధించి లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chaudhary) మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ ఉనికిలో ఉందని అన్నారు. రాజీవ్ గాంధీ, నరసింహారావు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలలో కూడా దీనిని ప్రవేశపెట్టారని అన్నారు. అయితే.. ఆ బిల్లు ఇప్పుడు లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) తెలిపారు. ప్రతిపక్ష నేత ప్రకటనను రికార్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అధీర్ రంజన్ చౌదరి ప్రకటనపై లోక్‌సభలో పెద్ద దుమారమే చెలరేగింది. ఆయన ప్రసంగంపై ఎన్డీయే ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.