అవును మీరు చదువుతున్నది నిజమే. ఓ ముఠా ఇద్దరు కూలీలను ఉద్యోగులుగా నియమించుకుంది. కానీ వారు చేయాల్సిన పని ఏంటంటే ఖరీదైన ఫోన్లను(Costly phones) దొంగతనం(Theft) చేసుకొచ్చి ఈ ముఠాకు అప్పజెప్పాలి. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఐ ఫోన్(Iphone) లేదా ఇతర ఖరీదైన ఫోన్లను దొంగతనం చేసి అప్పజెప్తే నెలకు రూ.25 వేల జీతం ఇస్తారు.
అవును మీరు చదువుతున్నది నిజమే. ఓ ముఠా ఇద్దరు కూలీలను ఉద్యోగులుగా నియమించుకుంది. కానీ వారు చేయాల్సిన పని ఏంటంటే ఖరీదైన ఫోన్లను(Costly phones) దొంగతనం(Theft) చేసుకొచ్చి ఈ ముఠాకు అప్పజెప్పాలి. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఐ ఫోన్(Iphone) లేదా ఇతర ఖరీదైన ఫోన్లను దొంగతనం చేసి అప్పజెప్తే నెలకు రూ.25 వేల జీతం ఇస్తారు. ఇందుకుగాను ముఠా నియమించుకున్న ఉద్యోగులకు చక్కటి శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. అహ్మదాబాద్‌లోని(Ahmedabad) ఈ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. వివారాల్లో వెళ్తే..
సెల్ ఫోన్ల దొంగతనం చేసే ముఠాను అహ్మదాబాద్ సిటీ క్రైంపోలీసులు(City Crime Police) అరెస్ట్ చేశారు. అవినాష్ మహతో, శ్యాంకుర్మి అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి. ముఠా నుంచి రూ.29 లక్షల విలువైన 58 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పింటూ మహతో, రాహుల్ మహతోలు రోజు వారీ కూలీలు. ఈ కూలీలకు నెలకు రూ.25 వేలు నెల జీతం ఇచ్చి సెల్‌ఫోన్ దొంగతనం చేసేందుకు నియమించుకున్నారు. సెల్‌ఫోన్ దొంగతనాలపై వారికి శిక్షణ కూడా ఇస్తారు. వారితో ఖరీదైన మొబైళ్లు దొంగతనం చేయించారు. వారు తెచ్చిన మొబైల్స్‌ను అన్‌లాక్ చేసి నేపాల్, బంగ్లాదేశ్‌లకు పంపిస్తారు. చోరీ చేసిన మొబైళ్లలో ఐఫోన్‌లు అధికంగా ఉన్నాయి. ఐఫోన్లతో పాటు ఖరీదైన ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.