చాలా దేశాల్లో సెక్స్ సమ్మతి వయసు (Age of Consent) ఎంత ఉండాలని చర్చలు నడుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పలు దేశాల్లో మినిమం(Minimum) ఏజ్ ఆఫ్ సెక్సువల్ కన్సెంట్‌పై వివాదాలు(Controversy) కూడా చెలరేగుతున్నాయి. యూనిసెఫ్ (UNICEF) ప్రకారం సెక్స్‌లో పాల్గొనే విషయంలో పిల్లలు సొంతగా ఏ వయసులో(Age) నిర్ణయం తీసుకోగలరని భావిస్తారో ఆ వయసును మినిమం ఏజ్ ఆఫ్ సెక్సువల్ కన్సెంట్ అంటారు. అంటే ‘సెక్స్‌కు అంగీకారం తెలిపే కనీస వయసు అని అర్ధం. సెక్సువల్ హరాష్‌మెంట్(Harassments) నుంచి పిల్లలను కాపాడేందుకు మినిమం ఏజ్ ఆఫ్ సెక్సువల్ కన్సెంట్‌ను తీసుకొచ్చారు. కొందరు చిన్నపిల్లలను ప్రలోభపెట్టి లోబర్చుకోవాలని చూస్తుంటారు. చిన్న వయసులో సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఆరోగ్యంపై(Health) ప్రభావం పడే అవకాశంతో పాటు గర్భం(pregnancy) ధరించే అవకాశం ఉంటుదంటున్నారు. దీంతో చదువులకు(Education) దూరమవుతారని అంచనా వేసి.. ఈ ఏజ్ ఆఫ్ సెక్సెవల్ కన్సెంట్‌పై ఆయా దేశాలు నిర్ణయాలు తీసుకుంటుంటాయి.