ఇప్పుడు అందరి దృష్టి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly Elections)పైనే ఉంది! అందుకు కారణం వచ్చే లోక్‌సభ ఎన్నికలపై అంతో ఇంతో ఈ ఫలితాల ప్రభావం ఉంటుంది కాబట్టి! రేపొద్దున్న ఎన్నికలు జరిగే తెలంగాణలో సైతం కర్ణాటక ఎన్నికల ప్రభావం ఉంటుంది. అందుకే కర్ణాటకలో ఎవరు గెలుస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకట్రెండు మినహా సర్వే సంస్థలన్నీ కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఉన్నాయని చెప్పాయి.

ఇప్పుడు అందరి దృష్టి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly Elections)పైనే ఉంది! అందుకు కారణం వచ్చే లోక్‌సభ ఎన్నికలపై అంతో ఇంతో ఈ ఫలితాల ప్రభావం ఉంటుంది కాబట్టి! రేపొద్దున్న ఎన్నికలు జరిగే తెలంగాణలో సైతం కర్ణాటక ఎన్నికల ప్రభావం ఉంటుంది. అందుకే కర్ణాటకలో ఎవరు గెలుస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకట్రెండు మినహా సర్వే సంస్థలన్నీ కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఉన్నాయని చెప్పాయి. తాజాగా ABP CVoter Opinion Poll కూడా ఇదే విషయాన్ని తెలిపింది. కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని బల్లగుద్దీ మరీ చెబుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి 80 సీట్లు వచ్చాయి. బీజేపీకి 104 స్థానాలు లభించాయి. జేడీ (ఎస్‌) 37 చోట్ల విజయం సాధించింది. అప్పుడు కాంగ్రెస్‌, జేడీ (ఎస్‌) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తదనంతరకాలంలో బీజేపీ చేతుల్లోకి అధికారం వెళ్లింది. ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 121 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని సీ ఓటర్‌ సర్వే తెలిపింది. బీజేపీకి 74 స్థానాలు, జేడీ (ఎస్‌)కు 29 స్థానాలు లభించవచ్చని పేర్కొంది. మొత్తంగా చూస్తే కాంగ్రెస్‌కు 115 నుంచి 127 సీట్లు రావచ్చు. బీజేపీకి 68 నుంచి 80 స్థానాలు, జేడీ (ఎస్‌)కు 23 నుంచి 35 స్థానాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నయని సీ ఓటర్‌ సర్వే స్పష్టం చేసింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో 38 శాతం ఓట్లను సాధించిన కాంగ్రెస్‌ ఈ సారి రెండు శాతం ఓట్లను అధికంగా దక్కించుకోనుంది. గత ఎన్నికల్లో 36 శాతం ఓట్లను రాబట్టుకున్న బీజేపీ ఈసారి 34.7 శాతానికే పరిమితం కాబోతున్నదని ఒపీనియన్ పోల్‌తో తేలింది. గత ఎన్నికల్లో 18 శాతం ఓట్లను సాధించిన జేడీ (ఎస్‌) ఈసారి ఇంచుమించు అంతే శాతం ఓట్లను సాధించవచ్చు. ఇతర పార్టీలకు 7.3 శాతం ఓట్లు దక్కనున్నట్టు సర్వే అంచనా వేసింది. సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రెస్‌ 41.2 శాతం ఓట్లతో 18 నుంచి 22 స్థానాలను గెల్చుకునే అవకాశం ఉంది. బీజేపీ 37.7 శాతం ఓటర్లతో 12 నుంచి 16 సీట్లు దక్కించుకోవచ్చక. జేడీ (ఎస్‌) 13.1 శాతం ఓట్లతో ఓ స్థానంలో విజయం సాధించవచ్చని సర్వే అంచనా వేసింది. కోస్టల్ కర్ణాటకలో కాంగ్రెస్‌ 41.2 శాతం ఓట్లతో ఎనిమిది నుంచి 12 సీట్లు గెల్చుకోవచ్చు. బీజేపీ 46.2 శాతం ఓట్లతో తొమ్మిది నుంచి 13 సీట్లు దక్కించుకునే ఛాన్సుంది. అత్యంత కీలకమైన గ్రేటర్‌ బెంగళూరులోనూ కాంగ్రెస్‌దే పై చేయిగా ఉండనుందట! ఇక్కడ కాంగ్రెస్‌కు 38.6 శాతం ఓట్లతో పాటు 15 నుంచి 19 సీట్లు వచ్చే అవకాశాలున్నాయట! బీజేపీ 36.8 శాతం ఓట్లతో 11 నుంచి 15 సీట్లు సాధింవచ్చని అంచనా వేసింది సర్వే! తెలుగువారు ఎక్కువగా ఉండే హైదరాబాద్‌ కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ 43.7 శాతం ఓట్లతో 19 నుంచి 23 స్థానాలు గెల్చుకోవచ్చని సీ ఓటర్‌ సర్వే పేర్కొంది. ముంబాయి కర్ణాటక, ఓల్డ్‌ మైసూరు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్‌కే ఎడ్జ్‌ ఉంది.

కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలలో నిరుద్యోగం కీలకంగా మారనుందట! విద్యుత్‌, నీళ్లు, రహదారుల అంశాలు తర్వాతి ప్లేసుల్లో ఉన్నాయి. మత విద్వేషాల అంశం, హిజాబ్‌ వివాదం, శాంతి భద్రతల అంశం కూడా ఎన్నికల్లో కీలకపాత్ర పోషించబోతున్నాయి. బీజేపీ పనితీరుపై 27.7 శాతం మంది మాత్రమే బాగుందని చెప్పారు. 21.8 శాతం మంది సాధారణమన్నారు. 50.5 శాతం మంది బాగోలేదని చెప్పారని సీ ఓటర్ ఒపినీయన్‌ పోల్‌ వెల్లడించింది. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై పని తీరుకు 26.8 మంది మాత్రమే కితాబిచ్చారు. 26.3 శాతం మంది సాధారణంగా ఉందని అంటే, 46.9 శాతం మంది బాగోలేదని చెప్పారు. ప్రధాని మోదీ పనితీరుపైనా సర్వే చేశారట: 47.4 మంది బాగుందని అంటే, 18.8 శాతం మంది ఫర్వాలేదన్నారు. 33.8 శాతం మంది బాగోలేదని తేల్చేశారట! కాంగ్రెస్‌ గెలిస్తే డి.కె.శివకుమార్‌ సీఎం కావచ్చని ప్రచారం జరుగుతోంది. ABP CVoter Opinion Pollలో మాత్రం సిద్ధరామయ్య పేరు వినిపించడం ఆశ్చర్యం. సిద్ధరామయ్య పట్ల 39.1 శాతం మంది మొగ్గు చూపితే, బొమ్మైని కోరుకుంటున్నవారు 31.1 శాతం మందే ఉన్నారు. బీజేపీపై అసహనంగా ఉన్నవారు 57.1 శాతం మంది ఉన్నారట. ప్రభుత్వం మారకూడదని కోరుకుంటున్న వాళ్లు 25.8% మంది ఉన్నట్టు సర్వే చెప్పింది. మొత్తంగా కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువగా విజయావకాశాలున్నాయని సర్వే చేస్తే బీజేపీకి 34 శాతం, కాంగ్రెస్‌కు 39 శాతం ఓట్లు పడ్డాయి. అసలు నచ్చని పార్టీ ఏమైనా ఉందా అని అడిగితే బీజేపీకి వ్యతిరేకంగా 33.3 శాతం, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా 30.5 శాతం మంది ఓటు వేశారు.

Updated On 24 April 2023 1:43 AM GMT
Ehatv

Ehatv

Next Story