తమిళనాడులోని(Tamil Nadu) తంజావూరులో(thanjavoor) ఓ వ్యక్తికి మరో పనే లేదు 'ఆ పని తప్ప'. అదే పనిగా మహిళలను(Women) బుట్టలో వేసుకొని వారితో రతిక్రీడలో రెచ్చిపోతున్నాడు. భర్త నిర్వాకాన్ని గమనించిన అతని భార్య ఆర్తీ మధురై ధర్మాసనంలో(Madhurai) ఓ పిటిషన్ వేసింది. తన భర్త వ్యవహారాలు తాను భరించలేనని.. అతడిపై సీఐడీ విచారణ చేయించాలని కోరింది. ఒకటి కాదు రెండు కాదు సుమారు 500 మంది మహిళలతో అతనికి వివాహేతర(Extra marital affair) సంబంధం ఉన్నట్లు అతని భార్య ఆరోపిస్తోంది.
తమిళనాడులోని(Tamil Nadu) తంజావూరులో(thanjavoor) ఓ వ్యక్తికి మరో పనే లేదు 'ఆ పని తప్ప'. అదే పనిగా మహిళలను(Women) బుట్టలో వేసుకొని వారితో రతిక్రీడలో రెచ్చిపోతున్నాడు. భర్త నిర్వాకాన్ని గమనించిన అతని భార్య ఆర్తీ మధురై ధర్మాసనంలో(Madhurai) ఓ పిటిషన్ వేసింది. తన భర్త వ్యవహారాలు తాను భరించలేనని.. అతడిపై సీఐడీ విచారణ చేయించాలని కోరింది. ఒకటి కాదు రెండు కాదు సుమారు 500 మంది మహిళలతో అతనికి వివాహేతర(Extra marital affair) సంబంధం ఉన్నట్లు అతని భార్య ఆరోపిస్తోంది. అతని ఫోన్ లో ఉన్న సుమారు వెయ్యి అసభ్యకరమైన వీడియోలు, వీడియో కాల్ స్క్రీన్ షాట్స్ చూస్తే ఆశ్చర్యపోక మానరు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఆమె కోర్టును ఆశ్రయించింది.
తన భర్త ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా అతని సెల్ ఫోన్ నిండా అసభ్యకరంగా ఉన్న వీడియో కాల్ స్క్రీన్ షాట్లు, అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలే ఉన్నాయి.. అడిగితే బెదిరిస్తున్నాడని ఆ మహిళ ఆవేదన చెందింది. ఒకరోజు తన భర్త సెల్ ఫోన్ చూడగా అందులో అసభ్యకరమైన వీడియో కాల్ స్క్రీన్ షాట్స్ తెలిపింది. ఫోన్ మొత్తం చూడగా వందల సంఖ్యలో అసభ్యకర వీడియోలు, ఫోటోలు ఉన్నాయని ఆరోపించింది. దీనిపై తన భర్త, తల్లితండ్రులను నిలదీయగా బయట ఎవరికీ చెప్పొద్దని బెదిరించినట్లు తెలిపారు. రెండు నెలల గర్భంతో ఉన్నప్పుడు తనపై దాడి చేయడంతో అబర్షన్ ఆమె వాపోయారు. భర్త, అత్తామామల ఆకృత్యాలపై తంజావూరు మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. భర్త వ్యవహారంపై సీబీసీఐడీ దర్యాప్తు చేపట్టేలా చూడాలని ఆమె కోర్టును కోరారు. దీంతో ఆమె ఈ పిటిషన్‌పై జస్టిస్ సుకుమార గురు విచారించారు. తంజావూరు ఎస్పీ, సీబీసీఐడీ జవాబివ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వాయిదా వేశారు. ఈ కేసు బయటకు పొక్కడంతో ఇప్పుడు అంతా మన కామాంధుడి గురించే చర్చించుకుంటున్నారు.