పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై రాజకీయ పార్టీలు, నేతలు స్పందిస్తున్నారు. సీఏఏకు బీజేపీ(BJP) మిత్రపక్షాలు మద్దతు ఇస్తుంటే, మరికొన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా సీఏఏ అమలుపై తమిళ్ హీరో, తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, దళపతి విజయ్‌ (Vijay thalapathy) స్పందించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై రాజకీయ పార్టీలు, నేతలు స్పందిస్తున్నారు. సీఏఏకు బీజేపీ(BJP) మిత్రపక్షాలు మద్దతు ఇస్తుంటే, మరికొన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా సీఏఏ అమలుపై తమిళ్ హీరో, తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, దళపతి విజయ్‌ (Vijay thalapathy) స్పందించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తమిళనాడు (Tamil Nadu)లో ఎట్టి పరిస్థితుల్లోనూ సీఏఏను అమలు చేయవద్దంటూ రాష్ట్ర సర్కారుకు విజయ్‌ విజ్ఞప్తి చేశారు. పౌరసత్వ సవరణ చట్టం అమలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. రాష్ట్రంలో దీన్ని అమలు చేయకూదని కోరుతున్నానన్నారు. ఈ అంశంపై ప్రభుత్వ నేతలు ప్రజలకు హామీ ఇవ్వాలని కోరారు. ఇటీవలే రాజకీయాలలోకి వచ్చిన విజయ్‌ తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అయితే త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వమన్నారు. 2026లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, సీఏఏ అమలుకు కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేయడాన్ని ఆమ్‌ ఆద్మీపార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, కేరళ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశాన్ని విభజించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లో దీన్ని తమ రాష్ట్రంలో అమలుచేయబోమని స్పష్టం చేశారు. సీఏఏ వల్ల ప్రస్తుతం దేశానికి వచ్చే ప్రయోజనమేమిటో చెప్పాలని పలు పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి

Updated On 12 March 2024 4:13 AM GMT
Ehatv

Ehatv

Next Story