కరోనా(Corona) సృష్టించిన విలయం నుంచి ప్రపంచదేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కోవిడ్‌ వైరస్‌ లక్షలాది మందిని బలి తీసుకుంది. అంతకు పది రెట్ల మందిని అనారోగ్యానికి గురి చేసింది. తాజాగా అలాంటి ప్రాణాంతక వైరస్‌ ఒకటి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్‌లో బర్డ్‌ఫ్లూ వైరస్‌లో హెచ్‌5ఎన్‌1(Bird flue H5N1) అనే వేరియంట్‌ మొదట ఆవులకు(Avulu) అంటుకుంది.

కరోనా(Corona) సృష్టించిన విలయం నుంచి ప్రపంచదేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కోవిడ్‌ వైరస్‌ లక్షలాది మందిని బలి తీసుకుంది. అంతకు పది రెట్ల మందిని అనారోగ్యానికి గురి చేసింది. తాజాగా అలాంటి ప్రాణాంతక వైరస్‌ ఒకటి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్‌లో బర్డ్‌ఫ్లూ వైరస్‌లో హెచ్‌5ఎన్‌1(Bird flue H5N1) అనే వేరియంట్‌ మొదట ఆవులకు(Avulu) అంటుకుంది. ఆవుల నుంచి ఓ కార్మికుడికి వ్యాపించింది. ఆ వ్యక్తికి వైద్యపరీక్షలు నిర్వహించినప్పుడు బర్డ్‌ ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. బర్డ్‌ ఫ్లూ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాది అని, కోవిడ్‌ కంటే ఇది చాలా డేంజరని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ హెచ్‌ఓడి డాక్టర్ జుగల్ కిషోర్ హెచ్చరిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల వ్యాధులపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పిట్స్‌బర్గ్‌లో బర్డ్ ఫ్లూపై పరిశోధనలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు ఈ వ్యాధి మానవాళికి అతి పెద్ద ముప్పు అని అంటున్నారు. రాబోయే కాలంలో ఈ వ్యాధి లక్షలాది మందికి సోకే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ హెచ్5ఎన్1 చాలా వేగంగా విస్తరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
బర్డ్‌ఫ్లూ వైరస్‌ పక్షుల మలం, లాలాజలం ద్వారా ఒకదానికొకటి వ్యాపిస్తుంది. దీని ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉంది. కొద్ది రోజుల్లోనే ఈ వైరస్ లక్షలాది పక్షులకు సోకుతుంది. వాటి మరణానికి కారణమవుతుంది. అయితే మనం భయపడాల్సిన విషయం ఏమిటంటే బర్డ్ ఫ్లూ సోకిన పక్షుల నుంచి మనుషులకు ఇట్టే వ్యాపించడం. పక్షుల చుట్టూ నివసించే, పౌల్ట్రీ ఫామ్‌లలో పనిచేసే వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బర్డ్ ఫ్లూ పక్షి మలం పడిన ప్రాంతాల్లో తిరిగినా చాలు ఆ వైరస్‌ అంటుకుంటుంది. బర్డ్‌ ఫ్లూ సోకిన వారికి దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది న్యుమోనియాకు దారి తీయవచ్చు. సకాలంలో చికిత్స జరగకపోతే ప్రాణాలు పోవచ్చు. బర్డ్ ఫ్లూకు తగిన మందు లేదని, కేవలం లక్షణాల ఆధారంగానే రోగికి చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. అయితే బర్డ్ ఫ్లూ నివారణ సులభంగా చేయవచ్చు. దీని కోసం బర్ద్ ఫ్లూ సోకిన పక్షితో సంబంధం లేకుండా ఉండటం ముఖ్యం. పక్షి దగ్గరికి వెళ్లినా అతను PPE కిట్ ధరించాలి. చికెన్‌ను బాగా ఉడికించి తినాలి.

Updated On 6 April 2024 1:08 AM GMT
Ehatv

Ehatv

Next Story