ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు నిర్మాణాలు (constructions) కాసింత ఈజీ అయ్యాయి. టెక్నాలజీ (technology) పెరగడమే ఇందుకు కారణం. అయినప్పటికీ సామాగ్రి, కూలీలు (workers) దొరకడం కొంచెం ఇబ్బందే! ఈ ఇబ్బందులు కూడా లేకుండా స్వల్ప వ్యవధిలోనే నిర్మాణలు పూర్తి చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు నిర్మాణాలు (constructions) కాసింత ఈజీ అయ్యాయి. టెక్నాలజీ (technology) పెరగడమే ఇందుకు కారణం. అయినప్పటికీ సామాగ్రి, కూలీలు (workers) దొరకడం కొంచెం ఇబ్బందే! ఈ ఇబ్బందులు కూడా లేకుండా స్వల్ప వ్యవధిలోనే నిర్మాణలు పూర్తి చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. త్రీడ ప్రింటింగ్‌ టెక్నాలజీతో (3D printing technology) కొన్ని రోజుల్లోనే నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు. అయితే దేశంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ఓ దేవాలయాన్నిరూపొందించారు(temple). అది కూడా మన సిద్దిపేటలోని(siddipet) బూరుగుపల్లి సమీపంలోనే! నెల రోజుల పాటు త్రీడీ ప్రింటింగ్‌తో 30 గంటల్లోనే శ్రీపాద కార్యసిద్ధేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. 3,800 చదరపు అడుగు విస్తీర్ణంలో30 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ ఆలయం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ(robi) మిషన్‌ను ఏబీబీ అనే యూరోపియన్‌ నుంచి తీసుకొచ్చారు.ఇందులో ఉండే ఇంటర్నల్‌ సిస్టమ్‌, వినియోగించే సాఫ్ట్‌వేర్‌ను (software)మన దేశంలోనే తయారు చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా 2022లో 3డీ ప్రిటింగ్‌ విధానంలో కాలిఫోర్నియాలోని టెహమా కౌంటీలో చర్చి నిర్మించారు. సింప్లిఫోర్జ్‌ క్రియేషన్స్‌ (simplifies creations)ఈ ఏడాది మార్చిలో ఐఐటీ హైదరాబాద్‌తో (IIT Hyderabad) కలిసి దేశంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్‌ నమూనా వంతెనను నిర్మించింది. దేశంలోనే తొలిసారిగా మిషనరీతో సిద్దిపేటలో దేవాలయం నిర్మించారు.సిద్దిపేటలో నిర్మించిన శ్రీపాద కార్యసిద్దేశ్వరస్వామి ఆలయాన్ని ఈ మధ్యనే ప్రారంభించారు. వారం రోజులపాటు విగ్రహప్రతిష్ట మహోత్సవాలను నిర్వహించారు. నిత్యం విశేష పూజలు నిర్వహిస్తున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు నిర్మాణం తీరును అడిగి తెలు సుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇంజినీర్లు, పలు నిర్మాణ సంస్థలు వచ్చి నిర్మాణాన్ని పరిశీలిస్తున్నారు. ఆలయంలోని గర్భగుడీలు ఒక్కొక్కటి ఒక్కో ఆకారంలో నిర్మించారు. హేరంబ గణపతి కోసం మోదకం ఆకారంలో 11 అడుగుల ఎత్తు, ఎనిమిది అడుగుల వెడల్పుతో గర్భగుడిని నిర్మించారు. భువనేశ్వరి అమ్మవారి కోసం కమలం మొగ్గ ఆకారంలో గర్భగుడిని నిర్మించారు. దత్తాత్రేయ స్వామితో పాటు స్పటికలింగానికి దీర్ఘచతురస్రాకారంలో గర్భగుడిని నిర్మించారు.

Updated On 20 Dec 2023 10:34 PM GMT
Ehatv

Ehatv

Next Story