Worldcup Screening : తెలుగురాష్ట్రాల్లో భారీ స్క్రీన్లకు సన్నాహాలు
రేపు అహ్మదాబాద్‌లోని(Ahmedabad) నరేంద్ర మోడీ స్టేడియంలో(Narendra modi stadium) భారత్(India)-ఆస్ట్రేలియా(Australia) మధ్య ఐసీసీ-2023 వరల్డ్ కప్(ICC World cup) ఫైనల్ జరగనుంది. రేపు మ.2 గంటలకు ఈ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అహ్మదాబాద్ కిక్కిరిసిపోయింది. హోటళ్లలోని గదులన్నీ నిండిపోయాయి. అయితే ఈ మ్యాచ్‌ను చూసేందుకు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్క్రీన్లు(screen) ఏర్పాటు చేస్తున్నారు.
రేపు అహ్మదాబాద్‌లోని(Ahmedabad) నరేంద్ర మోడీ స్టేడియంలో(Narendra modi stadium) భారత్(India)-ఆస్ట్రేలియా(Australia) మధ్య ఐసీసీ-2023 వరల్డ్ కప్(ICC World cup) ఫైనల్ జరగనుంది. రేపు మ.2 గంటలకు ఈ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అహ్మదాబాద్ కిక్కిరిసిపోయింది. హోటళ్లలోని గదులన్నీ నిండిపోయాయి. అయితే ఈ మ్యాచ్‌ను చూసేందుకు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్క్రీన్లు(screen) ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలోని(Telangana) పలు చోట్ల ఈ స్క్రీన్లు ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు. జీహెచ్‌ఎంసీ(GHMC), ద్వితీయశ్రేణి పట్టణాల్లో ఈ బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకు పోటీ చేస్తున్న రాజకీయపార్టీల నేతలు ఈ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. 2003లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు గచ్చిబౌలి స్టేడియం సహా పలు ప్రాంతాల్లో ఈ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా మంచి స్పందన రావడంతో ఇప్పుడు గచ్చిబౌలి, ఎల్బీస్టేడియం, ఇండోర్ స్టేడియాలు సహా పలు మైదానాలలో ఈ స్క్రీన్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
మరోవైపు ఏపీలో(AP) బిగ్ స్క్రీన్ల(Big Screens) ఏర్పాటుకు అక్కడి క్రికెట్ అసోసియేషన్(Cricket Assosiation) ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల్లో భారీగా స్క్రీన్లు ఏర్పాటు చేస్తోంది. 2 లక్షల మంది ఒకేసారి చూసేలా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులకు ఎంట్రీ ఫీజు ఉచితమేనని తెలిపారు. ఈ బిగ్ స్క్రీన్ల ఏర్పాటు ఖర్చు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భరింస్తుందన్నారు గోపినాథ్‌రెడ్డి(Gopinath Reddy). ఈనెల 15న జరిగిన భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ఈ విధంగా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తే అనూహ్య స్పందన వచ్చిందన్నారు. విజయవాడ, విశాఖ, కడపలో ఈ స్క్రీన్లు ఏర్పాటు చేస్తే విపరీతమైన స్పందన వచ్చిందన్నారు. ఇందులో భాగంగానే దేశంలోనే తొలిసారిగా ఇప్పుడు రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో ఈ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.