హస్తినకు తెలుగు నేతలు క్యూ కట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్‌(congress) తీర్థం పుచ్చుకున్న షర్మిల(YS Sharmila), తెలుగుదేశంపార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు(Nara Lokesh) ఢిల్లీలోనే ఉన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలపై సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్‌ ఢిల్లీకి వెళితే, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో పాటు కాంగ్రెస్‌ కండువా వేసుకునేందుకు షర్మిల ఢిల్లీకి వెళ్లారు. న్యాయవాదుల నుంచి న్యాయపరమైన సలహాలు తీసుకునేందుకు లోకేశ్‌ ఢిల్లీకి(Delhi) వెళ్లారు. ఈ ముగ్గురు నేతలు ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు.

కొన్ని కీలక పరిణామాలకు సాక్షులుగా నిలిచారు కూడా! ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge), రాహుల్‌గాంధీ(Rahul gandi) సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన షర్మిల తర్వాత సోనియాగాంధీని(Sonia Gandhi) కలిశారు. కాంగ్రెస్‌ పార్టీ తనకు ఎలాంటి బాధ్యతలను అప్పగించినా పని చేయడానికి సిద్ధమన్నారు. రాహుల్‌ను ప్రధాని చేయడమే తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయమని చెప్పారు. తండ్రి బాటలోనే తాను పయనిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇదే సమయంలో ఢిల్లీలో ఉన్న లోకేశ్‌ ఎప్పటిలాగే జగన్‌పై విరుచుకుపడ్డారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మునిగిపోయే నావ అని చెప్పుకొచ్చారు. షర్మిల ఢిల్లీకి వెళ్లినప్పుడే లోకేశ్‌ అక్కడికి ఎందుకు వెళ్లినట్టు? పర్యటన వెనుక అంతరార్థం ఏమిటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

లోకేశ్‌కు అయినా, షర్మిలకు అయినా ప్రస్తుతానికి ఉమ్మడి శత్రువు జగనే! బీజేపీ దగ్గరకు రానివ్వడం లేదు కాబట్టి ఇండియా కూటమిలో టీడీపీ చేరే అవకాశాలు కొట్టిపారేయ్యలేం! రాజకీయాలలో ఏదైనా సాధ్యమే కాబట్టి ఎన్నికల నాటికి కాంగ్రెస్‌తో టీడీపీ దగ్గర కావచ్చు. అప్పుడు షర్మిల-లోకేశ్‌లు కలిసి ఉమ్మడి సభలను పెట్టనూ వచ్చు. లోపాయికారి ఒప్పందం కోసం లోకేశ్‌ ఢిల్లీకి వెళ్లి ఉంటారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే షర్మిల ప్రయత్నించారు. కాకపోతే ఆ ప్రయత్నం ఫలించలేదు.

రేవంత్‌రెడ్డి అడ్డుకున్నారనే వార్తలు అప్పట్లో వచ్చాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం రేవంత్‌రెడ్డి-షర్మిల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలను కూడా తొలగించే ప్రయత్నం చేయవచ్చు. ఇదే సమయంలో హైదరాబాద్‌లో కూడా ఏపీకి సంబంధించిన పొలిటికల్‌ యాక్టివిటీ జరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత తల్లి విజయమ్మను లోటస్‌పాండ్‌లో జగన్‌ కలవబోతున్నారు. చెల్లెలు తను విరోధించే కాంగ్రెస్‌ పార్టీలో చేరడం జగన్‌కు ఇబ్బందికర పరిణామమే! షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పటి నుంచి విజయమ్మ కూతురు పక్షానే నిలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి పెరిగింది. విజయమ్మతో జగన్ భేటి తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Updated On 4 Jan 2024 5:57 AM GMT
Ehatv

Ehatv

Next Story