అమెరికా నార్త్ కరోలినాలో ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్న తెలుగు ఎన్ఆర్ఐ పెళ్లి చేసుకోవడానికి మంచి అమ్మాయి కోసం మ్యాట్రిమోనీ సైట్‌ను ఆశ్రయించాడు.

అమెరికా నార్త్ కరోలినాలో ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్న తెలుగు ఎన్ఆర్ఐ పెళ్లి చేసుకోవడానికి మంచి అమ్మాయి కోసం మ్యాట్రిమోనీ సైట్‌ను ఆశ్రయించాడు. 2023లో అతనికి మ్యాట్రిమోనీలో మధ్యప్రదేశ్ ఇండోర్‌(indore)కు చెందిన బర్కా జైస్వానీ(Burka Jaiswani) అనే పేరుతో మోడల్ ఫోటో పెట్టుకుని ఓ అమ్మాయి పరిచయమైంది. కొంతకాలం మాట్లాడుకున్న తర్వాత వాట్సప్‌లోనూ టచ్‌లోకి వచ్చారు. తర్వాత ఆమె ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, విదేశీయానం కల అంటూ పలు కారణాలు చెప్పి అతని దగ్గర విడతలవారీగా రూ.2.68 కోట్లు కొట్టేసింది. ఇటీవల ఆ యువకుడు ఆమెకు వీడియో కాల్ చేస్తే మ్యాట్రిమోనీ ప్రొఫైల్‌లో ఉన్న యువతిలా లేకపోవడంతో అనుమానం వచ్చింది. డబ్బుల విషయం అడగ్గా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో, ఆ యువకుడు అమెరికా నుంచి ఇండోర్‌కు వచ్చి పోలీసులను ఆశ్రయించాడు.. దర్యాప్తు చేయగా ఆమె అసలు పేరు సిమ్రాన్ అని, ఆమెకు అప్పటికే పెళ్లయిందని తెలిసింది. మోడల్ ఫోటో పెట్టి తన సోదరుడు విశాల్‌తో కలిసి యువకుడిని మోసం చేసి, తీసుకున్న డబ్బుతో అప్పులు తీర్చి, కార్లు కొనుక్కున్నారని తెలిసింది.. నిందితులను అరెస్టు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated On 12 April 2025 10:30 AM GMT
ehatv

ehatv

Next Story