దేశభక్తి(patriotism) అనే భావోద్వేగాలను వెండితెరపై చక్కగా పండించి తద్వారా కాసులను పండించుకున్నారు మన నిర్మాతలు. సినిమాలకు సంబంధించి దేశభక్తి ఎవర్‌గ్రీన్‌ సబ్జెక్ట్‌. అందుకే అడపా దడపా దేశభక్తితో కూడిన సినిమాలు తీసి నాలుగు డబ్బులు వెనకేసుకుంటున్నారు నిర్మాతలు. మనం ఇంకా బ్రిటిష్‌(Brittish) పాలనలో ఉన్న కాలంలోనే సినిమాల్లో దేశభక్తి గీతాలను జొప్పించారు.

దేశభక్తి(patriotism) అనే భావోద్వేగాలను వెండితెరపై చక్కగా పండించి తద్వారా కాసులను పండించుకున్నారు మన నిర్మాతలు. సినిమాలకు సంబంధించి దేశభక్తి ఎవర్‌గ్రీన్‌ సబ్జెక్ట్‌. అందుకే అడపా దడపా దేశభక్తితో కూడిన సినిమాలు తీసి నాలుగు డబ్బులు వెనకేసుకుంటున్నారు నిర్మాతలు. మనం ఇంకా బ్రిటిష్‌(Brittish) పాలనలో ఉన్న కాలంలోనే సినిమాల్లో దేశభక్తి గీతాలను జొప్పించారు. 1931లో వచ్చిన కాళిదాస్‌ (Kalidas)సినిమాలో మహాత్మా గాంధీని(Mahatma Gandhi) కీర్తిస్తూ ఓ పాట ఉంది. అది మొదలు స్వాతంత్ర్యవాంఛను ప్రజలలో రగల్చడానికి సినిమాలు తమవంతు పాత్రను పోషించాయి. తెలుగులో వచ్చిన మొదటి సాంఘిక చిత్రం ప్రేమ విజయం. ఇది 1936లో వచ్చింది. ఇందులో కూడా స్వాతంత్ర్య కాంక్ష కనిపిస్తుంది.

ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలు దేశభక్తిని చాటుతూ, నాటి సమాజంలో పాతుకుపోయిన దురాచారాలను విమర్శిస్తూ వచ్చాయి. మాలపిల్ల(Malapilla), మళ్లీ పెళ్లి(Mallipelli), రైతుబిడ్డ(Raithu bidda), వందేమాతరం(Vande Mataram), సుమంగళి(Sumangali), దేవత వంటి సినిమాలలో దేశభక్తి ప్రధానంగా సాగే సన్నివేశాలు కనిపిస్తాయి. గూడవల్లి రామబ్రహ్మం తీసిన రైతుబిడ్డ అప్పట్లో సంచలనం. జమీందారి వ్యవస్థను విమర్శిస్తూ తీసిన ఆ సినిమాను బ్రిటిష్‌ ప్రభుత్వం కొన్ని చోట్ల నిషేధించింది. వందేమాతరం సినిమాకు కూడా ఇదే పరిస్థితి. 1941లో మహాత్యాగాంధీ ఆశయాలతో మహాత్మాగాంధీ అనే సినిమాను తీశారు.

కాని డాక్యుమెంటరీలా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 1946లో గూడవల్లి రామబ్రహ్మం పల్నాటి యుద్ధం సినిమాను మొదలుపెట్టారు. దురదృష్టవశాత్తూ సినిమా పూర్తి కాకముందే కన్నుమూశారు. దాంతో మిగిలిన సినిమాను ఎల్‌.వి.ప్రసాద్‌(LV Prasad) పూర్తి చేశారు. 1947లో విడుదలైన ఈ సినిమాలో బ్రిటిష్‌ పాలనను విమర్శించే పదునైన డైలాగులు ఉండటం గమనార్హం. అలనాటి అగ్రనటులు ఎన్టీఆర్‌(NTR), ఎఎన్ఆర్‌(ANR), కృష్ణ(Krishna), శోభన్‌బాబు(Shobhan Babu) సినిమాల్లో దేశభక్తిని చాటే సన్నివేశాలను అనేకం ఉన్నాయ.

స్వాతంత్ర్య సమరయోధుల జీవితాల ఆధారంగా కూడా చాలా సినిమాలు వచ్చాయి. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు(Alluri sitha rama raju) ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇది ఎవర్‌గ్రీన్‌ సినిమా! శివాజీగణేషన్‌ నటించిన వీర పాండ్య కట్టబొమ్మన్‌ సినిమా తమిళంలోంచి తెలుగులోకి డబ్‌ అయింది. ఇక్కడ కూడా విజయవంతం అయ్యింది. విజయ్‌చందర్‌ నటించిన ఆంధ్రకేసరి, చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ఈ కోవలోకే వస్తాయి. తాండ్రపాపారాయుడు, సర్దార్‌ పాపారాయుడు వంటి సినిమాలు కూడా స్వాతండ్ర పోరాటం నేపథ్యంగా తీసినవే! కమల్‌హాసన్‌ భారతీయుడులో కూడా తెల్లవారి దాష్టికాలను చూపించారు.

రోజా(roja), ఖడ్గం(Khadgan), మహాత్మ, ఘాజీ ఎటాక్‌, ఉరి, ఆర్‌ఆర్‌ఆర్‌, సీతారామం వంటి సినిమాలు దేశభక్తిని చాటి చెప్పాయి.స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో ఆ ఆనందాన్ని గుర్తు చేస్తూ పలు పాటలు రాశారు కవులు. వాటిని చక్కగా సినిమాల్లో చూపించారు దర్శకులు. 1948లో వచ్చిన బాలరాజు సినిమాలో నవోదయం శుభోదయం నవయుగ శోభామహోదయం అనే పాట ఇలాంటిదే.

మొదట ప్రైవేటు గీతాలుగా వచ్చి తర్వాత సినిమాల్లోకి వచ్చిన దేశభక్తి పాటలు చాలానే ఉన్నాయి. స్వాతంత్ర్యము మా జన్మహక్కని చాటండి, మ్రోయింపుము జయభేరీ, ఓహోహో స్వాతంత్య్ర దేవీ ఏవీ నీవిచ్చెడి కానుకలేవీ, హే భారత జననీ, దేశమును ప్రేమించుమన్నా, ఉదయమ్మాయెను... స్వేచ్ఛా భారత ఉదయమ్మాయెను వంటి పాటలు అప్పట్లో అందరినోటా వినిపించాయి.

ఎఎన్‌ఆర్‌ నటించిన వెలుగు నీడలు సినిమాలోని పాడవోయి భారతీయుడా పాట ఇప్పటికీ రిలవెంటే! ఎన్టీఆర్‌ నటించిన రైతుబిడ్డ, నిలువుదోపిడి, కోడలు దిద్దిన కాపురం, బడిపంతులు, మేజర్‌ చంద్రకాంత్‌ ఇత్యాది సినిమాల్లో దేశభక్తి గీతాలున్నాయి. జెండా పండుగ రోజున నేను నా దేశం పవిత్ర భారత దేశం, నాజన్మభూమి ఎంతో అందమైన దేశమూ, దేశం మనదే తేజం మనదే వంటి పాటలు తప్పనిసరిగా వినిపిస్తాయి.

కొసమెరుపు :
చిత్తూరు నాగయ్య గొప్ప నటుడు, గొప్ప గాయకుడు కూడా! సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు. ఆయన భక్తజనా సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్న వార్త తెలిసింది. సెట్లోనే ఆ విషయాన్ని తెలుసుకున్న నాగయ్య, శాంతకుమారి తదితరులు అప్పటికప్పుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశభక్తి గీతాలు ఆలపించారు. తెలుగు సినిమా విషయానికి వస్తే తొలి స్వాతంత్ర్య దినోత్సవం భక్త జనా సెట్లో జరిగింది. అన్నట్టు స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ గాయకుడు ఘంటసాల కూడా పాల్గొన్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.

Updated On 9 Aug 2023 4:14 AM GMT
Ehatv

Ehatv

Next Story