తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన రచన(Rachana) పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నారు. బెంగాలీ అయిన రచనా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్(Trinamool congress) అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి ఘన విజయం సాధించారు. హుగ్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె తన సమీప ప్రత్యర్థి లాకెట్ చటర్జీ (బీజేపీ)పై 76 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన రచన(Rachana) పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నారు. బెంగాలీ అయిన రచనా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్(Trinamool congress) అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి ఘన విజయం సాధించారు. హుగ్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె తన సమీప ప్రత్యర్థి లాకెట్ చటర్జీ (బీజేపీ)పై 76 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బెంగాల్ సినీ నటిగా కెరీర్ ప్రారంభించిన రచన నేను ప్రేమిస్తున్నాను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు. చిరంజీవితో బావగారు బాగున్నారా సినిమాలో నటించిన రచనకు కన్యాదానం, రాయుడు, మావిడాకులు, పిల్లనచ్చింది, లాహిరి లాహరి లాహిరిలో వంటి సినిమాలు మంచి పేరును తెచ్చాయి. 2002 తర్వాత ఆమె తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యారు. బెంగాలీ, ఒడియా భాషలలో అనేక చిత్రాలలో నటించిన రచన తమిళ, కన్నడ సినిమాల్లోనూ ప్రధాన భూమికలను పోషించారు. సినిమాల్లోంచి తప్పుకున్నాక రాజకీయాల్లో అడుగుపెట్టారు. అధికారపార్టీ తృణమూల్ కాంగ్రెస్‌లో క్రియాశీలక పాత్రను పోషిస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో హుగ్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.