ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌(sofware engeneering) జూదానికి అలవాటు పడ్డాడు. ఆన్‌లైన్‌ గేములకు(Online Games) అలవాటుపడి లక్షల్లో డబ్బు పొగొట్టుకున్నాడు. తీరా అప్పుతీర్చలేక ప్రాణాలు తీసుకున్నాడు. కరీంనగర్‌(Karimnagar) జిల్లా గంగాధరలోని మధురానగర్‌కు చెందిన నాగుల లక్ష్మణ్‌, లక్ష్మి దంపతుల కుమారుడు పృథ్వీ (25) బీటెక్‌ పూర్తి చేసి ఏడాది క్రితం హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేరు ఇంజినీరుగా చేరారు.

ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌(sofware engeneering) జూదానికి అలవాటు పడ్డాడు. ఆన్‌లైన్‌ గేములకు(Online Games) అలవాటుపడి లక్షల్లో డబ్బు పొగొట్టుకున్నాడు. తీరా అప్పుతీర్చలేక ప్రాణాలు తీసుకున్నాడు. కరీంనగర్‌(Karimnagar) జిల్లా గంగాధరలోని మధురానగర్‌కు చెందిన నాగుల లక్ష్మణ్‌, లక్ష్మి దంపతుల కుమారుడు పృథ్వీ (25) బీటెక్‌ పూర్తి చేసి ఏడాది క్రితం హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేరు ఇంజినీరుగా చేరారు. ఉత్తరప్రదేశ్‌ నోయిడాకు(Noida) కంపెనీ అతనిని బదిలీ చేసింది. దీంతో రెండు నెలల క్రితం నోయిడా వెళ్లిపోయాడు. అయితే అక్కడ పరిచయమైన ముగ్గురు వ్యక్తులు ఈ జూదంలోకి దింపారు. ఇతను కూడా ఆన్‌లైన్‌ గేములకు అలవాటు పడ్డాడు. వివిధ కారణాలు చెప్పి స్నేహితుల దగ్గర రూ.12 లక్షల అప్పు చేశాడు. 12 లక్షల రూపాయలను నాలుగు రోజుల్లోనే ఆవిరి చేశాడు. 15 రోజులుగా ఉద్యోగానికి కూడా వెళ్ల లేదు. అప్పులు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాలని కోరడం, ఎలా తీర్చాలో తెలియక సతమతమయ్యాడు. దీంతో ఆందోళనకు గురై గదిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు పృథ్వీ. సమాచారం అందుకున్న నోయిడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated On 8 May 2024 1:49 AM GMT
Ehatv

Ehatv

Next Story