తెలంగాణలోనూ (Telangana) కరోనా కేసులు (corona cases) పెరుగుతున్నాయి . రాష్ట్రంలో మంగళవారం నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో.. తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది. ఇవాళ్టి నుంచి విరివిరిగా కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించింది.

దేశ వ్యాప్తంగా మళ్లీ కరోనా అలజడి మొదలైంది. ఇప్పటికిప్పుడు కరోనాతో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా.. ముందు జాగ్రత్తగా టెస్టులు ( corona test) చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం మొత్తం 402 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా..నలుగురికి పాజిటివ్ వచ్చినట్లుగా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9 మంది కరోనా చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ (health ministry)అధికారులు వెల్లడించారు. మరోవైపు సికింద్రాబాద్గాంధీ ఆస్పత్రిలో (Gandhi hospital) 50 పడకలతో కూడిన కరోనా వార్డును సిద్ధం చేశారు. క్యాజువాలిటీ వార్డు వెనకవైపున 50 పడకలతో ఐసోలేషన్ వార్డు(isolation ward), మెటర్నిటీ విభాగం సమీపంలో మహిళల కోసం ప్రత్యేకంగా 20 పడకలతో మరో ఐసొలేషన్ వార్డు ఏర్పాటు చేశారు.
దేశంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 (corona JN-1)కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితులపై మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. గత అనుభవంతో కరోనాను కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలని వైద్యాధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.