కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్రమోదీ(PM) తెలంగాణ(Telangana)కు వచ్చినట్టు లేదని, తెలంగాణపై తన కడుపులోని విషాన్ని కక్కడానికి వచ్చినట్టు ఉందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) విమర్శించారు. ఆయన ప్రతి మాట సత్యదూరమని, ప్రధానిగా ఇన్ని అబద్ధాలు ఆడటం ఆయనకే చెల్లిందని ట్వీట్ చేశారు హరీశ్. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆసరా పెన్షన్(Aasara Pension), రైతు బంధు(Rythu Bandhu) వంటివి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతున్నాయని, తన వల్లే డిబిటి మొదలయ్యాయని అనడం పచ్చి అబద్ధమని,
కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్రమోదీ(PM) తెలంగాణ(Telangana)కు వచ్చినట్టు లేదని, తెలంగాణపై తన కడుపులోని విషాన్ని కక్కడానికి వచ్చినట్టు ఉందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) విమర్శించారు. ఆయన ప్రతి మాట సత్యదూరమని, ప్రధానిగా ఇన్ని అబద్ధాలు ఆడటం ఆయనకే చెల్లిందని ట్వీట్ చేశారు హరీశ్. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆసరా పెన్షన్(Aasara Pension), రైతు బంధు(Rythu Bandhu) వంటివి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతున్నాయని, తన వల్లే డిబిటి మొదలయ్యాయని అనడం పచ్చి అబద్ధమని, ఇందులో గొప్ప చెప్పుకోవలసి ఏముందని హరీశ్ ప్రశ్నించారు. 'రైతుబంధును కాపీ కొడితే పీఎం కిసాన్ అయ్యింది. పీఎం కిసాన్ వల్లే మొదటిసారి రైతులకు లబ్ధి అని చెప్పుకోవడం సిగ్గుచేటు. రైతుబంధుతో పోలిస్తే పీఎం కిసాన్(PM Kisan) సాయమెంత?' అని హరీశ్ ట్వీట్ చేశారు. 'వ్యవసాయానికి, పరిశ్రమలకు చేయూత అని చెప్పడం పూర్తి అవాస్తవం. ITIR ను బెంగళూర్ కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన వెంటనే గుజరాత్ లో అర్బిట్రేషన్ సెంటర్ పెట్టారు. తెలంగాణ ధాన్యాన్ని కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించారు. ఇవన్నీ చేసింది మీ ప్రభుత్వం కాదా మోడీ గారు?' అని నిలదీశారు.
అదానీ వాదం గురించి ప్రజల దృష్టి మళ్లించడానికి.. లేని పరివార వాదం గురించి మాట్లాడడం మీకే చెల్లిందని ప్రధానిని విమర్శించారు. 'రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందించడం లేదని మోదీ చెప్పడం హాస్యాస్పదం. నిజానికి ఈ పరిస్థితి రివర్స్ గా ఉంది. రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, జాతీయ హోదా వంటివి ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు ఎలాంటి సహకారం అందించడం లేదు' అని హరీశ్‌రావు అన్నారు.