(NCRB) నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2021 కి సంబంధించిన తన రిపోర్ట్ లో సంచలన విషయాలు బైట పెట్టింది. దేశం మొత్తంలో దళితులపై జరుగుతున్న దాడులు, హింస లో బీజేపీ(BJP) పాలిత మధ్య ప్రదేశ్(Madhya Pradesh) మొదటి స్థానంలో ఉందని రిపోర్ట్ లో పేర్కొంది. 2020 లో కూడా దళితులపై నేరాల జాబితాలో మధ్య ప్రదేశ్ మొదటి స్థానంలోనే ఉండగా, 2019 లో మాత్రం రాజస్థాన్ (Rajasthan)తరవాత రెండో స్థానంలో మధ్య ప్రదేశ్ నిలిచింది.

(NCRB) నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2021 కి సంబంధించిన తన రిపోర్ట్ లో సంచలన విషయాలు బైట పెట్టింది. దేశం మొత్తంలో దళితులపై జరుగుతున్న దాడులు, హింస లో బీజేపీ(BJP) పాలిత మధ్య ప్రదేశ్(Madhya Pradesh) మొదటి స్థానంలో ఉందని రిపోర్ట్ లో పేర్కొంది. 2020 లో కూడా దళితులపై నేరాల జాబితాలో మధ్య ప్రదేశ్ మొదటి స్థానంలోనే ఉండగా, 2019 లో మాత్రం రాజస్థాన్ (Rajasthan)తరవాత రెండో స్థానంలో మధ్య ప్రదేశ్ నిలిచింది. మధ్య ప్రదేశ్ లో నమోదవుతున్న క్రైమ్ రేట్(Crime Rate) ని పరిశీలిస్తే ఆ రాష్ట్రంలో దళితులపై పదేపదే జరిగిన అఘాయిత్యాల, అట్రాసిటీ(Astrocity) చట్టాల ఉల్లంఘనలకి అద్దం పడుతోంది.

అయితే తాజా రిపోర్ట్ ప్రకారం మిగతా రాష్ట్రాలకంటే మధ్యప్రదేశ్‌లో దళితుల పై దాడుల పట్ల ఛార్జ్ షీట్లు దాఖలు చేయబడిన రేటు ఎక్కువగా ఉంది, రాష్ట్ర పోలీసులుఅట్రాసిటీ నేరాలను నిరోధించలేకపోయినప్పటికీ, కనీసం ఇతర రాష్ట్రాల కంటే వాటిని మరింత సమర్థవంతంగా కోర్టులో ప్రవేశ పెట్టగలిగారు.

దళితులపై జరుగుతున్న నేరాల రేట్ ని ప్రతి లక్ష దళిత జనాభాని పట్టి లెక్కిస్తారు. అయితే NCRB ఇప్పటికి 2011 జనాభా లెక్కల ప్రకారమే లేఖిస్తుంది. 2021 జనాభా గణనని ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తుందనే ఆరోపణల నేపథ్యంలో, ఆ లెక్కలు వస్తే ఈ క్రైమ్ రేట్ శాతం మారొచ్చు.

ఈ నేరాలలో SC/STలపై అట్రాసిటీల నిరోధక చట్టం కింద నమోదు చేయబడ్డ కేసులు మాత్రమే కాకుండా SCలకు వ్యతిరేకంగా జరిగిన అన్ని నేరాలు/దౌర్జన్యాలు ఉంటాయి. ఖచ్చితంగా చెప్పాలంటే జరుగుతున్న దాడులు, నమోదవుతున్నఅట్రాసిటీ కేసుల సంఖ్యలో పెద్దగా మార్పు ఉండదు . ఉదాహరణకు, 2021లో దేశంలో ఎస్సీలపై 50,900 నేరాలు జరిగాయి. మధ్యప్రదేశ్‌లో ఈ సంఖ్య 7,214గా ఉంది. ఎస్సీ/ఎస్టీలపై అట్రాసిటీల నిరోధక చట్టం అమలు చేయబడిన కేసుల సంఖ్య అఖిల భారత స్థాయిలో 45,610 ఉంటె మధ్యప్రదేశ్‌లో 7,211.

2021లో జరిగిన దళితులపై దాడుల కేసులో జాతీయ సగటు 25.3 ఉంటె మధ్య ప్రదేశ్ లో ఈ రేటు 63.6 గా నమోదైంది. 2020 లో జాతీయ సగటు 25 శాతంగా ఉంటె మధ్య ప్రదేశ్ లో ఈ రేటు 60.8 గా నమోదయింది. ఇక 2019 లో జాతీయ సగటు 22.8 గా ఉంటె మధ్య ప్రదేశ్ లో 46.7 గా ఉంది. అయితే 2020 లో రాజస్థాన్ రెండో స్థానంలో ఉండగా, 2019 మాత్రం రాజస్థాన్ మొదటి స్థానం లో ఉండగా మధ్య ప్రదేశ్ రెండో స్థానం లో నిలిచింది.

మరో పక్క షెడ్యూల్డ్ తెగల (STలు)పై జరుగుతున్న దాడుల్లో 2019- 2021 మధ్య మూడు సంవత్సరాలలో కేరళ(Kerala) అగ్రస్థానంలో ఉందని NCRB రిపోర్ట్ లో పేర్కొంది. రాజస్థాన్ మూడేళ్లలో రెండవ స్థానంలో ఉండగా మధ్య ప్రదేశ్ 2019లో ఐదవ స్థానంలో, 2020లో నాల్గవ స్థానంలో, 2021లో మూడవ స్థానంలో ఉంది.

అట్రాసిటీ కేసుల నమోదుతో పాటు వాటి పై చార్జీ షీట్ దాఖలు చేయడం, కేసుల పరిష్కారం యొక్క డేటా కూడా ఎన్‌సిఆర్‌బి నివేదికలో పొందు పరిచింది. ఈ విషయంలో మాత్రం 2021 డేటా ప్రకారం మధ్య ప్రదేశ్ మెరుగైన పనితీరు కనబరిచింది. సిక్కిం తరవాత రెండో స్థానం లో మధ్య ప్రదేశ్ నిలిచింది. SCలపై నేరాల రెట్లో మధ్యప్రదేశ్ తరవాత రాజస్థాన్ రెండో ప్లేస్ లో ఉన్నా కేసుల పరిస్కారం, చార్జీ షీట్ నమోదులో మాత్రం 19వ స్థానంలో ఉంది. అలాగే STలపై నేరాలకు సంబంధించి ఛార్జ్ షీట్‌లను దాఖలు చేయడం లో కూడా మధ్యప్రదేశ్ ముందు వరసలో ఉంది.

ముందే చెప్పినట్టుగా ఈ డేటా అంతా ఆ రాష్ట్రాల్లో ఉన్న దళిత జనాభాని పెట్టె లెక్క కడుతుంది NCRB. 2011 లేఖల ప్రకారం మధ్య ప్రదేశ్ లో SC జనాభా 113.4 కోట్లు కాగా క్రైమ్ రేట్ 60.8 గా నమోదైంది. ఇక చార్జీ షీట్ రేట్ 99.3 గా ఉంది.

ఇక మన తెలుగు రాష్ట్రాలకి వస్తే దళితులపై దాడుల కేసులలో ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) 23.8 శాతం తో 10 స్థానం లో తెలంగాణ(Telangana) 32.6 శాతంతో 4 ప్లేసులో ఉండగా, చార్జీ షీట్ రేట్ లో మాత్రం ఆంధ్ర 14వ స్థానం లో తెలంగాణ 15వ స్థానాలలో నిలిచాయి.

ఇప్పుడు దళితులపై దాడులతో రగులుతున్న మణిపూర్ మాత్రం 2018 నుంచి 2021 వరకు జీరో క్రైమ్ గా నిలవడం విశేషం

Updated On 25 July 2023 1:48 AM GMT
Ehatv

Ehatv

Next Story