ప్రార్థనస్థలాల దగ్గర లింగ వివక్ష చూపరాదని, భగవంతుడి(God) ఎదుట స్త్రీ పురుషులందరూ సమానమేనని తెలంగాణ హైకోర్టు(TS High Court) తెలిపింది. శని శింగనాపూర్‌, హాజీ అలీదర్గా, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల్లాగే తెలంగాణ హైకోర్టు కూడా ముస్లిం(Muslims) మహిళలకు(Female) సంబంధించి ఓ సంచలన తీర్పు వెలువరించింది.

ప్రార్థనస్థలాల దగ్గర లింగ వివక్ష చూపరాదని, భగవంతుడి(God) ఎదుట స్త్రీ పురుషులందరూ సమానమేనని తెలంగాణ హైకోర్టు(TS High Court) తెలిపింది. శని శింగనాపూర్‌, హాజీ అలీదర్గా, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల్లాగే తెలంగాణ హైకోర్టు కూడా ముస్లిం(Muslims) మహిళలకు(Female) సంబంధించి ఓ సంచలన తీర్పు వెలువరించింది. మసీదులు(Masjid), జషన్‌లతో పాటు ప్రార్థనా మందిరాలలోకి మహిళలను అనుమతించాలని వక్ఫ్‌ బోర్డును(Waqf Board) ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎందులోనూ తీసిపోరని కోర్టు అభిప్రాయపడింది. పురుషుల కంటే స్త్రీలు ఎలా తక్కువ అవుతారని ప్రశ్నించింది. పురుషుడి కంటే స్త్రీ తక్కువ అని భావిస్తే..మనకు జన్మనించిన తల్లి కూడా స్త్రీనేనని, మన కన్నతల్లి మనకంటే తక్కువ ఎలా అవుతుందని కోర్టు నిలదీసింది. నిర్దిష్టమైన కొద్దిరోజులు మినహా మహిళలు నిరభ్యంతరంగా ప్రార్థనా స్థలాల్లోకి వెళ్లి ప్రార్థనలు చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
మహారాష్ట్రలోని శని శింగనపూర్‌ ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని రద్దు చేస్తూ బొంబాయి హైకోర్టు తీర్పు చెప్పింది. ముంబైలోని హాజీ అలీ దర్గాలో పవిత్ర స్థలంలోకి మహిళలను అనుమతించాలని బొంబాయి హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే దేశ సర్వోన్నత న్యాయస్థానం శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలని ఆదేశిస్తూ 2018, సెప్టెంబర్‌ 29న సంచలన తీర్పు చెప్పింది. ఈ తీర్పుల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

Updated On 12 Dec 2023 1:00 AM GMT
Ehatv

Ehatv

Next Story