తెలంగాణ(Telangana) గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్(Tamilisai Soundarajan) మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి(Politics) రావాలనుకుంటున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) పోటీ చేయాలని ఆశపడుతున్నారు. ఇందుకోసమే ఆమె ఢిల్లీకి(Delhi) వెళ్లారని వినికిడి.
తెలంగాణ(Telangana) గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్(Tamilisai Soundarajan) మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి(Politics) రావాలనుకుంటున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) పోటీ చేయాలని ఆశపడుతున్నారు. ఇందుకోసమే ఆమె ఢిల్లీకి(Delhi) వెళ్లారని వినికిడి. సొంత రాష్ట్రమైన తమిళనాడు(Tamil Nadu) నుంచి ఆమె పోటీ చేయడానికి సిద్ధమయ్యారని చెబుతున్నారు. తన ఎంపీ అభ్యర్థిత్వంపై అమిత్ షాను(Amit Shah) కోరడానికే ఆమె ఢిల్లీ వెళ్లారట! సౌత్ చెన్నై నుంచి కానీ తిరునల్వేలి నుంచి కానీ ఆమె పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారట! ఇంతకు ముందు రెండుసార్లు ఎంపీగా పోటీ చేసిన తమిళిసైకి గెలుపు దక్కలేదు. 2009 ఉత్తర చెన్నై నుంచి, 2019లో తూత్తూకూడి నుంచి ఆమె లోక్‌సభకు పోటీ చేశారు. రెండు సార్లు ఆమెకు పరాజయమే ఎదురయ్యింది. మూడు సార్లు అసెంబ్లీకి పోటీ చేశారు. అక్కడ కూడా అంతే! అయినప్పటికీ బీజేపీకి ఆమె చేసిన సేవలకు గుర్తుగా ఆమెను 2019 సెప్టెంబర్‌లో తెలంగాణ గవర్నర్‌గా నియమించింది కేంద్రం. 2021 నుంచి పుదుచ్చేరి లెప్టెనెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.