తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ముగ్గురు సలహాదారులను(Advisors) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం(CM advisors) సలహాదారులుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌ రెడ్డి(Narender Reddy), ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ(Shabbir Ali), కాంగ్రెస్‌ నేత హర్కర వేణుగోపాల్‌ను(venu gopal) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ముగ్గురు సలహాదారులను(Advisors) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం(CM advisors) సలహాదారులుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌ రెడ్డి(Narender Reddy), ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ(Shabbir Ali), కాంగ్రెస్‌ నేత హర్కర వేణుగోపాల్‌ను(venu gopal) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో(Delhi) రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ మల్లు రవిని నియమించింది. వీరికి కేబినెట్‌ హోదా కల్పించాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా షబ్బీర్‌ అలీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రొటోకాల్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ సలహాదారుగా వేణుగోపాల్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపింది. ఇప్పటికే రెండు ఎమ్మెల్సీలను ప్రకటించిన కాంగ్రెస్‌, ప్రభుత్వ సలహాదారులు, సీఎం సలహాదారులను నియమించింది. ఆర్టీసీ చైర్మన్ సహా పలు కీలక పదవులపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి లండన్‌ నుంచి తిరిగివచ్చిన తర్వాత ఈ నియామకాలపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated On 21 Jan 2024 4:48 AM GMT
Ehatv

Ehatv

Next Story