తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) నోటిఫికేషన్‌(Notification) వచ్చింది. ఈ నెల 8న మొదలై నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమై రువారంతో ముగియనుంది. ఈనెల 16న నామినేషన్ల(Nominations) పరిశీలన, 20న ఉపసంహరణకు గడువు విధించింది. ఈ నెల 27న ఎన్నిక‌లు జరగనున్నాయి. అసెంబ్లీలో పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల ప్రకారం రెండు కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్ఎస్‌కు దక్కనున్నాయి.

తెలంగాణలో మూడు రాజ్యసభ(Rajya sabha) స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) నోటిఫికేషన్‌(Notification) వచ్చింది. ఈ నెల 8న మొదలై నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమై రువారంతో ముగియనుంది. ఈనెల 16న నామినేషన్ల(Nominations) పరిశీలన, 20న ఉపసంహరణకు గడువు విధించింది. ఈ నెల 27న ఎన్నిక‌లు జరగనున్నాయి. అసెంబ్లీలో పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల ప్రకారం రెండు కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్ఎస్‌కు దక్కనున్నాయి.

నామినేషన్లకు ఒక్క రోజే గడువు ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ(AICC) కసరత్తు తుదిదశకు చేరింది.. ఇప్పటికే అధిష్ఠానం సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అభిప్రాయం తీసుకున్నట్లు సమాచారం. ఏఐసీసీ కోటా కింద పార్టీ కోశాధికారి అజయ్‌ మాకెన్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణ నుంచి ఏఐసీసీ కోటా కింద అవకాశం ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే రెండో సీటు కోసం కాంగ్రెస్‌లో(Congress) తీవ్ర పోటీ నెలకొంది. బీసీ లేదా ఎస్టీకి ఇవ్వాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. ఇప్పటికే ఓసీ అయిన అజయ్‌ మాకెన్‌కు అవకాశం దక్కడంతో రాజ్యసభ సీటును ఆశించిన జానారెడ్డి, చిన్నారెడ్డి, రేణుకాచౌదరికి అవకాశాలు లేనట్లేనని తెలుస్తోంది. బీసీ, ఎస్టీ నుంచి రాజ్యసభ ఆశిస్తున్నవారిలో వీహెచ్‌, బలరాంనాయక్ ఉన్నారు. రేవంత్‌ కూడా వీహెచ్‌కు(V Hanumanth) ఇచ్చేందుకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్, భట్టి, ఉత్తం, శ్రీధర్‌బాబుతో చర్చించాక అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. నామినేషన్లకు చివరి రోజు గురువారం కావడంతో పార్టీ అభ్యర్థులను వెంటనే ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు స్థానాలకు ముగ్గురే నామినేషన్‌ వేసినట్లయితే రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమవుతాయి. ఈ నెల 20న నామినేషన్ల ఉపసంహరణ ఉండడంతో అదే రోజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.

Updated On 14 Feb 2024 12:57 AM GMT
Ehatv

Ehatv

Next Story