టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం కర్ణాటక డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను కలిశారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను బెంగళూరులో కలిశాను.

telangana congress mp Komati Reddy venkat reddy Meets karnataka tpcc chief DK Shivakumar
టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) శుక్రవారం కర్ణాటక డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) ను కలిశారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను బెంగళూరులో కలిశాను. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మర్యాదపూర్వకంగా ఆయన్ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా డీకే శివకుమార్ కు శుభాకాంక్షలు తెలియజేశానని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడం కోసం శివకుమార్ ఎంతో కష్టపడ్డారని అన్నారు. నాయకులను ఒకతాటిపైకి తీసుకొచ్చి, కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపి.. పార్టీని గెలుపు వైపు నడిపించారని కొనియాడారు.
