తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) నుంచి రాజ్యసభ అభ్యర్థులను(Rajya Sabha) అధిష్టానం ఖరారు చేసింది. రేణుకాచౌదరి(Renuka choudhary), ఎం.అనిల్‌కుమార్ యాదవ్(Anil kumar Yadav) పేర్లను అధిష్టానం వ్యూహాత్మకంగా ఖరారు చేసింది.
తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) నుంచి రాజ్యసభ అభ్యర్థులను(Rajya Sabha) అధిష్టానం ఖరారు చేసింది. రేణుకాచౌదరి(Renuka choudhary), ఎం.అనిల్‌కుమార్ యాదవ్(Anil kumar Yadav) పేర్లను అధిష్టానం వ్యూహాత్మకంగా ఖరారు చేసింది. రాజ్యసభ టికెట్‌ను ఆశించిన వి.హనుమంత్‌రావు, చిన్నారెడ్డి, అజారుద్దీన్‌కు నిరాశే ఎదురైంది. సీనియర్ కాంగ్రెస్ నాయకురాలైన రేణుకాచౌదరికి రాజ్యసభ స్థానాన్ని అధిష్టానం కట్టబెట్టింది. అయితే అనూహ్యంగా ముషీరాబాద్ కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్‌కు రాజ్యసభ సీటు కట్టబెట్టింది. తొలుత అజయ్ మాకెన్‌ను నియమించారని వార్తలు వచ్చినా ఇప్పుడు రేణుకాచౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఖరారు చేయడంతో ఊహాగానాలకు తెరపడింది.