2023-24లో తమ స్టేట్ ఓన్‌ రెవెన్యూ ట్యాక్స్‌లో(State Open Revenue Taxes) ఆయా రాష్ట్రాలు ఎంత మేర సబ్సీడీ పథకాలకు(Subsidy schemes) ఖర్చుచేస్తున్నాయో ఓ నివేదిక వెల్లడైంది. గత ఆరేళ్లలో రాష్ట్రాలు తమకు వచ్చే స్టేట్ ఓన్‌ రెవెన్యూ ట్యాక్స్‌లో అత్యధికంగా సబ్సీడీ ఇచ్చే రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh) తొలి స్థానంలో నిలిచింది. సబ్సీడీల కోసం అత్యల్పంగా ఖర్చు చేసే రాష్ట్రంగా కేరళ(Kerala) నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ సబ్సీడీల శాతం అత్యధికంగా 92.7 శాతం ఉండగా.. రెండో స్థానంలో నిలిచిన తమిళనాడు(Tamilnadu) 67.4 శాతం, మూడో స్థానంలో ఉన్న పంజాబ్‌ 39.6 శాతం ఆదాయాన్ని ఈ సబ్సిడీ పథకాలకు వెచ్చిస్తున్నాయి.

2023-24లో తమ స్టేట్ ఓన్‌ రెవెన్యూ ట్యాక్స్‌లో(State Open Revenue Taxes) ఆయా రాష్ట్రాలు ఎంత మేర సబ్సిడీ పథకాలకు(Subsidy schemes) ఖర్చుచేస్తున్నాయో ఓ నివేదిక వెల్లడైంది. గత ఆరేళ్లలో రాష్ట్రాలు తమకు వచ్చే స్టేట్ ఓన్‌ రెవెన్యూ ట్యాక్స్‌లో అత్యధికంగా సబ్సిడీ ఇచ్చే రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh) తొలి స్థానంలో నిలిచింది. సబ్సిడీల కోసం అత్యల్పంగా ఖర్చు చేసే రాష్ట్రంగా కేరళ(Kerala) నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ సబ్సిడీల శాతం అత్యధికంగా 92.7 శాతం ఉండగా.. రెండో స్థానంలో నిలిచిన తమిళనాడు(Tamilnadu) 67.4 శాతం, మూడో స్థానంలో ఉన్న పంజాబ్‌ 39.6 శాతం ఆదాయాన్ని ఈ సబ్సిడీ పథకాలకు వెచ్చిస్తున్నాయి.

ఏపీ(AP), తెలంగాణ(Telangana) 12, 14వ స్థానంలో నిలిచాయి. తెలంగాణలో వచ్చే ఆదాయంలో సబ్సిడీ పథకాలకు వెచ్చించే శాతం 12.4గా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్‌లో 14.4 శాతం ఆదాయాన్ని ఈ పథకాలకు ఖర్చు చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో 32.3 శాతం, కర్నాటకలో 26.2 శాతం, రాజస్థాన్‌లో 22.5 శాతం ఆదాయాలను సబ్సిడీ పథకాలకు ఖర్చుచేస్తున్నాయి. గుజరాత్‌లో 22 శాతం, జార్ఖండ్‌లో 21.9 శాతం ఉండగా.. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇది 19 శాతం ఉంది. హర్యానాలో 15.6 శాతం ఆదాయాన్ని సబ్సిడీ పథకాలు వెచ్చించగా ఆ తర్వాత స్థానంలో ఏపీ 14.4 శాతం, పశ్చిమబెంగాల్‌ 13.9 శాతం వెచ్చిస్తున్నాయి. తర్వాత స్థానంలో తెలంగాణ 12.4 ఉంది. ఉత్తరప్రదేశ్‌ 10 శాతం, ఢిల్లీ 8.9 శాతం, ఒడిషాలో 5.7 శాతం ఆదాయాన్ని ఖర్చు చేస్తుండగా. అత్యల్పంగా కేరళలో 2.7 శాతం ఆదాయాన్ని వెచ్చిస్తోంది.

Updated On 26 Dec 2023 6:18 AM GMT
Ehatv

Ehatv

Next Story