ఓడిపోతే ఓడిపోతుండొచ్చుకానీ తీతర్‌సింగ్(Teetar Singh) పట్టుదలను మాత్రం మెచ్చుకుని తీరాలి! ఓటమి గెలుపుకు సోపానం అని గట్టిగా నమ్మే ఆయన ఆత్మవిశ్వాసాన్ని ఒప్పుకుని తీరాలి. ఎవరీ తీతర్ సింగ్ అంటే.. రాజస్థాన్‌కు(Rajsthan) చెందిన ఓ పెద్ద మనిషి. వయసు 78 ఏళ్లు ఉంటాయి. గత 50 ఏళ్లుగా ఆయన రాజస్తాన్‌లో జరిగిన అన్ని రకాల ఎన్నికల్లో(Elections) పోటీ చేస్తూ వస్తున్నారు. ఒక్కదాంట్లో కూడా ఆయన విజయం సాధించలేదు కానీ ఏనాటికైనా గెలుస్తాననే ధీమా ఆయనలో ఉంది.
ఓడిపోతే ఓడిపోతుండొచ్చుకానీ తీతర్‌సింగ్(Teetar Singh) పట్టుదలను మాత్రం మెచ్చుకుని తీరాలి! ఓటమి గెలుపుకు సోపానం అని గట్టిగా నమ్మే ఆయన ఆత్మవిశ్వాసాన్ని ఒప్పుకుని తీరాలి. ఎవరీ తీతర్ సింగ్ అంటే.. రాజస్థాన్‌కు(Rajsthan) చెందిన ఓ పెద్ద మనిషి. వయసు 78 ఏళ్లు ఉంటాయి. గత 50 ఏళ్లుగా ఆయన రాజస్తాన్‌లో జరిగిన అన్ని రకాల ఎన్నికల్లో(Elections) పోటీ చేస్తూ వస్తున్నారు. ఒక్కదాంట్లో కూడా ఆయన విజయం సాధించలేదు కానీ ఏనాటికైనా గెలుస్తాననే ధీమా ఆయనలో ఉంది. దళిత(Dalit) సామాజికవర్గానికి చెందిన తీతర్‌సింగ్ 1970 నుంచి వేరువేరు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఇప్పుడు జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల బరిలోనూ దూకాడు. మన్రేగాలో లేబర్ పనులు చేసుకునే తీతర్‌సింగ్ ఈసారి కరాన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గత 50 ఏళ్ల కాలంలో పంచాయితీ ఎన్నికల నుంచి మొదలుపెడితే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వరకు అన్నింట్లోనూ పోటీ చేశారు. ప్రభుత్వం తమకు భూములు ఇవ్వాలని, సదుపాయాలను కలిగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ఈ ఎన్నికలు తమ హక్కుల గురించి జరుగుతున్న పోరాటంగా అభివర్ణించుకున్నాడు. పాపులారిటీ కోసమో, రికార్డుల కోసమే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, హక్కుల సాధన కోసమే బరిలో దిగుతున్నానని చెప్పాడు. ఏడో దశకంలో కెనాల్ కమాండ్ ఏరియాలో తనకు భూమి ఇవ్వలేదని, తనలాంటి వాళ్లు అనేకమంది భూములను కోల్పోయారని తీతర్‌సింగ్ వివరించాడు. నిరుపేద కార్మికులకు, సెంట్ భూమి కూడా లేనివారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. పోటీ చేసిన ప్రతీసారి డిపాజిట్ కోల్పోయేవాడు. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా పంతం వీడటం లేదు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో తీతర్‌సింగ్‌కు వచ్చిన ఓట్లు 938. 2013 ఎన్నికల్లో 427 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 653 ఓట్లు పోలయ్యాయి.