చంద్రయాన్‌ -3(Chandrayaan-3) అలా విజయవంతం అయ్యిందో లేదో ఆ క్రెడిట్‌ మొత్తాన్ని నరేంద్రమోదీ(Narendra Modi) నేతృత్వంలోని సర్కార్‌ కబ్జా చేసేసుకుంది. సైంటిస్టుల పాత్ర కంటే తమ పాత్రే ఎక్కువ అన్నట్టుగా డబ్బాలు కొట్టుకుంది. చంద్రయాన్‌ కోసం పని చేసిన వారికి 18 నెలలుగా జీతాలు లేవని కాంగ్రెస్‌(Congress) వారంటే దేశద్రోహులనే ముద్ర వేసింది. నిజానికి పాపం వారికి 18 నెలలుగా జీతాలు లేవట! ప్రతిష్టాత్మక చంద్రయాన్‌-3 లాంచ్‌ప్యాడ్‌ నిర్మాణంలో పని చేసిన టెక్నిషయన్‌ పరిస్థితి దుర్బరంగా మారింది. ఇస్రోకు(ISRO) చెందిన హెచ్‌ఈసీ(HEC) అంటే హెవీ ఇంజనీరింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగి దీపక్‌ కుమార్‌(Deepak Kumar) ఉప్రారియా రాంచీలోని ధుర్వా ప్రాంతంలో టీ, ఇడ్లీ దుకాణాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

చంద్రయాన్‌ -3(Chandrayaan-3) అలా విజయవంతం అయ్యిందో లేదో ఆ క్రెడిట్‌ మొత్తాన్ని నరేంద్రమోదీ(Narendra Modi) నేతృత్వంలోని సర్కార్‌ కబ్జా చేసేసుకుంది. సైంటిస్టుల పాత్ర కంటే తమ పాత్రే ఎక్కువ అన్నట్టుగా డబ్బాలు కొట్టుకుంది. చంద్రయాన్‌ కోసం పని చేసిన వారికి 18 నెలలుగా జీతాలు లేవని కాంగ్రెస్‌(Congress) వారంటే దేశద్రోహులనే ముద్ర వేసింది. నిజానికి పాపం వారికి 18 నెలలుగా జీతాలు లేవట! ప్రతిష్టాత్మక చంద్రయాన్‌-3 లాంచ్‌ప్యాడ్‌ నిర్మాణంలో పని చేసిన టెక్నిషయన్‌ పరిస్థితి దుర్బరంగా మారింది. ఇస్రోకు(ISRO) చెందిన హెచ్‌ఈసీ(HEC) అంటే హెవీ ఇంజనీరింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగి దీపక్‌ కుమార్‌(Deepak Kumar) ఉప్రారియా రాంచీలోని ధుర్వా ప్రాంతంలో టీ, ఇడ్లీ దుకాణాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చంద్రయాన్‌ -3 కోసం ఫోల్డింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ అండ్‌ స్లైడింగ్‌ డోర్‌ను తయారు చేసిన ఆ ప్రభుత్వ ఉద్యోగికి 18 నెలలుగా జీతం చెల్లించకపోవడంతో గత్యంతరం లేక రోడ్‌సైడ్‌ స్టాల్‌ను తెరిచారు. హెచ్‌ఈసీలో పని చేస్తున్న దీపక్‌కుమార్‌ తన ఆవేదనను మీడియాతో పంచుకున్నారు. 'జీతం అందక కొన్నాళ్లు క్రెడిట్‌ కార్డుతో నెట్టుకొచ్చాను. తర్వాత బంధువులు, స్నేహితుల ద్వారా దాదాపు 4 లక్షల రూపాయల అప్పు చేశాను. భార్య నగలు తాకట్టు పెట్టి కొన్ని రజులు ఇంటిని నడిపాను. ఇప్పుడిక అప్పులు తీర్చే పరిస్థితి లేదు' అంటూ బాధను వ్యక్త పరుచుకున్నారు. మరో గత్యంతరం లేక కడుపు నింపుకుంనేందుకు ఆకలితో చచ్చిపోవడం కన్నా టీ, ఇడ్లీ దుకాణం తెరవాల్సి వచ్చిందని చెప్పారు. 'భార్య మంచి ఇడ్లీలు చేస్తుంది. వాటిని అమ్మడం ద్వారా రోజుకి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలొస్తాయి. దాంతో 50 నుంచి వంద రూపాయల లాభం వస్తుంది. ఈ డబ్బుతోనే ఫ్యామిలీని నెట్టు కొస్తున్నాను' అని దీపక్‌ కుమార్‌ ఉప్రారియా తెలిపారు. అంతేకాదు తనకు ఇద్దరు కూతుళ్లని, ఈ ఏడాది ఇంకా స్కూల్ ఫీజు కట్టలేకపోవడంతో స్కూల్ నుంచి రోజూ నోటీసులు పంపుతున్నారన్నారు. క్లాస్ రూమ్‌లో టీచర్లు హెచ్ఈసీలో పనిచేస్తున్న వారి పిల్లలు ఎవరని అడిగి మరీ అవమానించారని, దీంతో తన కుమార్తెలు ఏడుస్తూ ఇంటికి రావడం చూసి గుండె పగిలిపోయిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఉప్రారియా తోపాటు సంస్థలోని దాదాపు 2,800 మంది ఉద్యోగుల జీతాలు అందలేదని తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాకు చెందిన ఉప్రారియా 2012లో, ప్రైవేట్ కంపెనీలో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి 8 వేల రూపాయల జీతంతో HECలో చేరారు. ప్రభుత్వ సంస్థ కావడంతో తన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆశపడ్డారు. కానీ అతని అంచనాలు తల్లకిందులైనాయి. అయితే జీతాల సమస్యపై కేంద్రం స్పందిస్తూ, హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ స్వతంత్ర సంస్థకాబట్టి ఉద్యోగుల జీతభత్యాల బాధ్యత ఆ సంస్థదే అని తెలిపింది.

Updated On 19 Sep 2023 7:28 AM GMT
Ehatv

Ehatv

Next Story