వన్డే ప్రపంచకప్‌(One day wOrld Cup) టోర్నమెంట్ ముగిసింది. టీమిండియాను(Team India) ఊరించి ఊరించి చివరన తుస్సుమనిపించింది. ఈసారి ఇండియా టోర్నమెంట్‌కు ఆతిథ్యమిచ్చిందే కానీ గ్రౌండ్‌ల ఎంపిక, షెడ్యూల్‌ విషయంలో తప్పిదాలు చేసింది. ఫైనల్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లో నిర్వహించడమే తప్పు. టోర్నమెంట్‌ ఆరంభ వేడుకలను కూడా జరపకుండా ఏదో కానిచ్చేశారు. సరే జరిగిందేదో జరిగిపోయింది. నాలుగేళ్ల తర్వాత జరిగే మరో ప్రపంచకప్‌లో టీమిండియా దున్నేస్తుందనే ఆశతో ఉందాం! ఇక వచ్చే వరల్డ్‌కప్‌ నాటికి ప్రస్తుతం టీమిండియాలో ఉన్న చాలా మంది ఆటగాళ్లు రిటైరయ్యే ఛాన్సుంది.

వన్డే ప్రపంచకప్‌(One day wOrld Cup) టోర్నమెంట్ ముగిసింది. టీమిండియాను(Team India) ఊరించి ఊరించి చివరన తుస్సుమనిపించింది. ఈసారి ఇండియా టోర్నమెంట్‌కు ఆతిథ్యమిచ్చిందే కానీ గ్రౌండ్‌ల ఎంపిక, షెడ్యూల్‌ విషయంలో తప్పిదాలు చేసింది. ఫైనల్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లో నిర్వహించడమే తప్పు. టోర్నమెంట్‌ ఆరంభ వేడుకలను కూడా జరపకుండా ఏదో కానిచ్చేశారు. సరే జరిగిందేదో జరిగిపోయింది. నాలుగేళ్ల తర్వాత జరిగే మరో ప్రపంచకప్‌లో టీమిండియా దున్నేస్తుందనే ఆశతో ఉందాం! ఇక వచ్చే వరల్డ్‌కప్‌ నాటికి ప్రస్తుతం టీమిండియాలో ఉన్న చాలా మంది ఆటగాళ్లు రిటైరయ్యే ఛాన్సుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohith Sharma) 2027లో జరిగే ప్రపంచకప్‌ ఆడటం కష్టమే! 36 ఏళ్ల రోహిత్‌శర్మకు ఇప్పటికే ఫిట్‌నెస్‌ సమస్యలు బాధిస్తున్నాయి. ఆ కారణంగా అన్ని మ్యాచ్‌లూ ఆటడం లేదు. 40 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత రోహిత్‌ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడటమన్నది అనుమానమే! ఈ టోర్నమెంట్‌లో దుమ్మురేపిన మహమ్మద్‌ షమికి(Mohammed Shami) కూడా ఇదే చివరి ప్రపంచకప్‌ కావచ్చు. 33 ఏళ్ల వయసున్న షమి ఇప్పుడైతే జోరుమీద ఉన్నాడు కానీ నాలుగేళ్ల తర్వాత ఇదే ఊపు కొనసాగించడం దుర్లభం. 37 ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో కొనసాగడం పేస్‌ బౌలర్లకు చాలా కష్టం. 37 ఏళ్ల వయసున్న రవిచంద్రన్‌ అశ్విన్‌కు(Ravichandran Ashwin), 34 ఏళ్ల వయసున్న జడేజా(Jadeja) కూడా వచ్చే ప్రపంచకప్‌లో కనిపించరు కాబోలు. పరుగుల యంత్రం విరాట్‌కోహ్లీ(Virat Kohli) వచ్చే ప్రపంచకప్‌ నాటికి 39 ఏళ్లు నిండుతాయి. ఇప్పటికే పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న కోహ్లి 39 ఏళ్ల వయసులోనూ బ్యాట్‌ను ఝుళిపించవచ్చు. కోహ్లీ విషయం చెప్పలేం. ఈ ప్రపంచకప్‌ కోసం వన్డే రిటైర్మెంట్‌ నుంచి బయటకు వచ్చిన బెన్‌ స్టోక్స్‌, అనుకోకుండా మధ్యలో అవకాశం దక్కించుకున్న ఏంజెలో మాథ్యూస్‌ కూడా వచ్చే వరల్డ్‌కప్‌ ఆడటం అనుమానమే! ఇక 38 ఏళ్ల మహమ్మద్‌ నబి (అఫ్గానిస్థాన్‌), 37 ఏళ్ల వార్నర్‌, 34 ఏళ్ల స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, స్టాయినిస్‌, 33 ఏళ్ల స్టార్క్‌ (ఆస్ట్రేలియా), 33 ఏళ్ల కేన్‌ విలియమ్సన్‌, 34 ఏళ్ల బౌల్ట్‌, సౌథీ (న్యూజిలాండ్‌), 36 ఏళ్ల షకిబుల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీం (బంగ్లాదేశ్‌), డేవిడ్‌ మలన్‌, మొయిన్‌ అలీ, క్రిస్‌వోక్స్‌, ఆదిల్‌ రషీద్‌ (ఇంగ్లాండ్‌), బవుమా, మిల్లర్‌, వాండర్‌ డసన్‌ (దక్షిణాఫ్రికా) తదితర ఆటగాళ్లకూ ఇదే చివరి ప్రపంచకప్‌ కావచ్చు. ఆల్‌రెడీ దక్షిణాఫ్రికాకు చెందిన డికాక్‌ , ఇంగ్లాండ్‌కు చెందిన డేవిడ్‌ విల్లీ ఈ ప్రపంచకప్‌తో వన్డేలకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

Updated On 20 Nov 2023 12:19 AM GMT
Ehatv

Ehatv

Next Story