Uppal Cricket stadium : టీమిండియాకు ఉప్పల్ స్టేడియం హాట్ ఫేవరేట్..!
ఈనెల 25 నుంచి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో(Uppal Cricket Stadium) భారత్(India)-ఇంగ్లాండ్(England) మధ్య ఐదు టెస్టు సిరీస్‌లలో(Test series) భాగంగా తొలి టెస్ట్ జరగనుంది. సొంత గడ్డపై భారత్ బలమైన జట్టు. ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం భారత్‌కు కంచుకోట. ఈ స్టేడియంలో టెస్టుల్లో భారత్‌ను ఓడించిన జట్టే లేదు. ఐదు టెస్టు మ్యాచ్‌లు ఇందులో జరగగా 4 టెస్టుల్లో టీమిండియా విజయం సాధించగా.. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది
ఈనెల 25 నుంచి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో(Uppal Cricket Stadium) భారత్(India)-ఇంగ్లాండ్(England) మధ్య ఐదు టెస్టు సిరీస్‌లలో(Test series) భాగంగా తొలి టెస్ట్ జరగనుంది. సొంత గడ్డపై భారత్ బలమైన జట్టు. ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం భారత్‌కు కంచుకోట. ఈ స్టేడియంలో టెస్టుల్లో భారత్‌ను ఓడించిన జట్టే లేదు. ఐదు టెస్టు మ్యాచ్‌లు ఇందులో జరగగా 4 టెస్టుల్లో టీమిండియా విజయం సాధించగా.. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. వన్డేల్లోనూ టీమిండియాకే అత్యధికశాతం విజయాలు దక్కాయి.
ఇక్కడ జరిగిన టెస్టులు, గెలుపోటములను ఓ సారి చూద్దాం
2010లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో 111 పరుగులతో హర్భజన్‌సింగ్ సెంచరీ చేయడం విశేషం.
2012లో మరోసారి న్యూజిలాండ్‌తో భారత్ తలపిడింది. ఈ టెస్టులో ఇన్నింగ్స్, 115 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. పుజారా (159) ఈ మ్యాచ్‌లో రాణించాడు. మ్యాచ్‌లో అశ్విన్ 12 వికెట్లు తీసుకున్నాడు.
2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్, 135 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 204 పరుగులతో పుజారా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
2017లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులో 208 పరుగుల తేడాతో భారత్ నెగ్గింది. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి 204 పరుగులతో రెచ్చిపోయాడు.
2018లో వెస్టిండీస్‌తో భారత్ తలపడగా.. ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గెలిచింది. పంత్ (92), రహానె (80), పృథ్వీ షా (70) సత్తా చాటారు. ఉమేశ్ యాదవ్ 10 వికెట్లు తీసుకోవడంతో గెలుపు సునాయసమైంది.
అయితే ఉప్పల్ స్టేడియం కోహ్లీకి ఫేవరేట్ అనే చెప్పాలి. ఆడిన ఐదు టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 379 పరుగులు చేసి 75.80 సగటుతో రాణించాడు. కానీ ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో వ్యక్తిగత కారణాలతో కోహ్లీ ఈ టెస్ట్‌కు దూరంగా ఉంటున్నాడు. దీంతో కోహ్లీని మిస్ అవుతున్నామని ఆయన ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు.