పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచరే పక్కదారి పట్టాడు. స్కూల్‌లోనే పోర్న్ చూస్తుండగా ఎనిమిదో తరగతి విద్యార్థి కంటపడ్డాడు.
పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచరే పక్కదారి పట్టాడు. స్కూల్‌లోనే పోర్న్ చూస్తుండగా ఎనిమిదో తరగతి విద్యార్థి కంటపడ్డాడు. ఇది చూసిన వ్యంగ్యంగా నవ్వాడని ఆ విద్యార్థిని గోడకేసి బాదాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలుడిని ఉపాధ్యాయుడు దారుణంగా కొట్టాడు. ఉపాధ్యాయుడు తన ఫోన్‌లో అశ్లీల చిత్రాలను చూస్తున్నట్లు రెండో తరగతి విద్యార్థితో పాటు సహవిద్యార్థులు చూశారు. దీంతో బాలుడిని ఉపాధ్యాయుడు కొట్టాడని పోలీసులు తెలిపారు. ఉపాధ్యాయుడు కుల్దీప్ యాదవ్ అసభ్యకరమైన కంటెంట్‌ను చూస్తున్నాడని గుర్తించిన విద్యార్థులు అతనిని చూసి నవ్వారు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయుడు ఓ బాలుడిని కొట్టాడు. ఈ ఘటనపై విద్యార్థి తండ్రి జై ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 'ఉపాద్యాయుడు నా కొడుకు జుట్టు పట్టుకుని తలను గోడకు బాదాడు. దీంతో నా కొడుకు చెవికి గాయాలు అయ్యాయని.. అసభ్య పదజాలంతో దూషించి కొడుకును బెత్తంతో కొట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేశామని, సమగ్ర దర్యాప్తు జరుగుతోందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) గోపీనాథ్ సోనీ తెలిపారు.