రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాట విని విని విసిగొచ్చేసింది. కళ్ల ముందు ఇన్నేసి రాజకీయ సమీకరణలు జరుగుతుంటే ఇక ఆ నానుడితో పనేముంటుంది. లేటెస్ట్‌గా బీజేపీ పొత్తు కోసం టీడీపీ-జనసేన పార్టీలు తెగ వెంపర్లాడుతున్నాయి కదా! ఇదే బీజేపీని(BJP), ఆ పార్టీ అధినేత నరేంద్రమోదీని(Narendra Modi) చంద్రబాబు ఇష్టం వచ్చినట్టుగా తిట్టేశారు. బొందిలో ప్రాణమున్నంత వరకు బీజేపీతో కలిసే ప్రసక్తే లేదనే శపథాలు చేశారు.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాట విని విని విసిగొచ్చేసింది. కళ్ల ముందు ఇన్నేసి రాజకీయ సమీకరణలు జరుగుతుంటే ఇక ఆ నానుడితో పనేముంటుంది. లేటెస్ట్‌గా బీజేపీ పొత్తు కోసం టీడీపీ-జనసేన పార్టీలు తెగ వెంపర్లాడుతున్నాయి కదా! ఇదే బీజేపీని(BJP), ఆ పార్టీ అధినేత నరేంద్రమోదీని(Narendra Modi) చంద్రబాబు ఇష్టం వచ్చినట్టుగా తిట్టేశారు. బొందిలో ప్రాణమున్నంత వరకు బీజేపీతో కలిసే ప్రసక్తే లేదనే శపథాలు చేశారు. 2018 తెలంగాణ ఎన్నికలప్పుడు మోదీని చంద్రబాబు అన్న మాటలు మన చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ అన్యాయం చేసిందనే కదా అప్పుడు ఆ పార్టీతో టీడీపీ తెగతెంపులు చేసుకున్నది? మరి ఈ అయిదేళ్లలో ఆంధ్రకు బీజేపీ చేసిన మేళ్లు ఏమిటో చంద్రబాబు చెప్పి మరీ ఆ పార్టీతో చెలిమి చేస్తే మంచిదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నది స్వప్రయోజనాల కోసం కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పచ్చ మీడియా ప్రాపగాండా మొదలు పెట్టేసింది. బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటే దేశవ్యాప్తంగా పెరిగిన మోదీ గ్రాఫ్‌తో విజయం సాధించవచ్చన్నది చంద్రబాబు ఆలోచన. 1999లో ఈ ఆలోచనతోనే కదా చంద్రబాబు అధికారంలోకి వచ్చింది! ఇప్పుడు అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే చంద్రబాబుకు ప్రాధాన్యమని ప్రజలు నమ్మాలి కదా! ఆ బాధ్యతను టీడీపీ అనుకూల మీడియా భుజాన వేసుకుంది. పొత్తుల కోసం చంద్రబాబు బీజేపీని అడగడం లేదని, వారే చంద్రబాబుతో మైత్రీకి ప్రయత్నిస్తున్నారని ప్రచారం చేస్తున్నాయి. ఇంతకు ముందు ఎన్డీయేలో(NDA) ఉన్న అన్ని పార్టీలను తిరిగి కలుపుకునే ప్రయత్నంలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించిందని వార్తలు రాస్తున్నాయి. బీజేపీపై చంద్రబాబు జాలిపడి ఢిల్లీకి వెళ్లారన్నమాట! తన స్నేహం కావాలంటే తన డిమాండ్లను నెరవేర్చాలని చంద్రబాబు షరతు పెట్టారని టీడీపీ అనుకూల మీడియా బ్రేకింగ్‌లు వేసి మరీ నడిపించింది. ఆ డిమాండ్లు ఏమిటంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం చేయకూడదు. వెనుకబడిన జిల్లాల కోసం ప్రకటించే ప్యాకేజీలను ఏపీ మాత్రం గణనీయంగా చెంచాలి. అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి పూర్తి సహయ సహకారాలను అందించాలి. అన్నట్టు అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందనే విషయాన్ని చంద్రబాబు ఎదుట అమిత్‌ షా అంగీకరించారట! అంటే తన పార్టీ అధికారంలోకి రావడం కన్నా ఏపీ బాగుపడాలన్నది చంద్రబాబు లక్ష్యమని ప్రజలు అనుకోవాలన్నమాట! ఆ రకంగా వారి మైండ్‌సెట్‌ మార్చే పనిని టీడీపీ అనుకూల మీడియా విజయవంతంగా నిర్వర్తిస్తోంది.

Updated On 9 March 2024 2:39 AM GMT
Ehatv

Ehatv

Next Story