తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) తన వాగ్ధాటిని తమిళ ప్రజలకు వినిపించబోతున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన తమిళనాడు వెళుతున్నారు. గురు, శుక్రవారాలలో ఆయన కోయంబత్తూరులో(Coimbatore) పర్యటిస్తారు. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో నిర్వహించే సభలు, సమావేశాలు, రోడ్‌షోలలో లోకేశ్‌ పాల్గొంటారు.

తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) తన వాగ్ధాటిని తమిళ ప్రజలకు వినిపించబోతున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన తమిళనాడు వెళుతున్నారు. గురు, శుక్రవారాలలో ఆయన కోయంబత్తూరులో(Coimbatore) పర్యటిస్తారు. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో నిర్వహించే సభలు, సమావేశాలు, రోడ్‌షోలలో లోకేశ్‌ పాల్గొంటారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ(BJP) అధ్యక్షుడు, కోయంబత్తూరు లోక్‌సభ అభ్యర్థి అన్నామలై కుప్పుస్వామికి(Annamalai Kuppuswamy) మద్దతుగా లోకేశ్‌ ప్రచారం చేయడం చర్చనీయాంశమయ్యింది. కోయంబత్తూరులో ఉన్న తెలుగువారందరినీ లోకేశ్‌ ప్రభావితం చేస్తారన్నది అన్నామలై గట్టి నమ్మకం. ఆంధ్రప్రదేశ్‌లో లోకేశ్‌ను కూటమి దూరం పెట్టిన విషయం అన్నామలైకు తెలియదు కాబోలు. భారత తొలి ప్రధానమంత్రి మహాత్మాగాంధీ అని చెప్పిన అన్నామలైకు లోకేశ్‌ గురించి ఏమి తెలుస్తుందిలేండి! లోకేశ్‌ను క్రౌడ్‌ పుల్లర్‌గా ఆయన భావిస్తున్నారు. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్న అన్నామలై కోసం వెళుతున్న లోకేశ్‌ మరి ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి మద్దతుగా ప్రచారం చేస్తారా? చేయరా? అన్నది ఆసక్తిగా మారింది. పొత్తులో బీజేపీ కూడా భాగస్వామినే కాబట్టి పొత్తు ధర్మం ప్రకారం ప్రచారం చేయాల్సి ఉంటుంది. పైగా పురంధేశ్వరి ఎవరో కాదు, లోకేశ్‌కు స్వయానా పెద్దమ్మ! పెద్దమ్మ కోసం ఆ మాత్రం చేయాలి కదా! రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే కదా! చంద్రబాబు అరెస్ట్‌ అయినప్పుడు బీజేపీ పెద్దలను దగ్గరుండి కలిపించినందుకైనా కృతజ్ఞతాభావంతో పెద్దమ్మకు లోకేశ్‌ ప్రచారం చేయాలి! అది ధర్మం కూడా!

Updated On 11 April 2024 4:07 AM GMT
Ehatv

Ehatv

Next Story