చంద్రబాబు ఇటీవల ఒక నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఈ ఇంటర్వ్యూలో బాబు మాట్లాడుతూ... 2050 నాటికి భారత్ తిరుగులేని శక్తిగా మారుతుందని.. ప్రపంచాన్ని శాసించేది భారత్ అంటూ అయన కొనియాడారు. మోడీ నాయకత్వంలో దేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందని... ఎవరికీ సాధ్యంకాని కొన్ని నిర్ణయాలను మోదీ చేసిచుపించారన్నారు.. పెద్దనోట్ల రద్దు సరైనదేనని..

చంద్రబాబు మారిపోయారు... ఇప్పుడు బీజేపీ పాట పడుతున్నారు. మొన్నటిదాకా టీడీపీ నేతలంతా మోదీని కేంద్ర ప్రభుత్వాన్ని బండబూతులు తిట్టారు. అయితే వాటికి బిన్నంగా చంద్రబాబు మోదీపై అమితమైన ప్రేమ కురిపించారు... మోడీ పాలనను, అయన నిర్ణయాలను స్వాగతించారు.

చంద్రబాబు ఇటీవల ఒక నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఈ ఇంటర్వ్యూలో బాబు మాట్లాడుతూ... 2050 నాటికి భారత్ తిరుగులేని శక్తిగా మారుతుందని.. ప్రపంచాన్ని శాసించేది భారత్ అంటూ అయన కొనియాడారు. మోడీ నాయకత్వంలో దేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందని... ఎవరికీ సాధ్యంకాని కొన్ని నిర్ణయాలను మోదీ చేసిచుపించారన్నారు.. పెద్దనోట్ల రద్దు సరైనదేనని.. రూ.500 కు మించిన పెద్దనోట్లను రద్దు చేస్తే దేశంలో అవినీతి అనేది ఉండదని బాబు తెలిపారు.. ఈ సంభాషణలో ఏపీ ప్రత్యేకహోదాపై కూడా బాబు స్పందించారు.. బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చి రాజధాని అభివృద్ధికి సహకరించినట్లైతే.. ఇప్పుడు మూడు రాజధానుల అంశం వచ్చేది కూడా కాదని అయన తెలిపారు.

ఏపీ ఎన్నికలకు కేవలం ఏడాది సమయమే ఉంది.. ఈసారి టీడీపీ ఎలాగైనా అదిఆకారంలోకి రావాలని భావిస్తుంది. అందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి పవన్ తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ భావిస్తుంది.. కానీ టీడీపీతో పొత్తుకు బీజేపీ సానుకూలంగా లేదు.. టీడీపీని రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే వస్తుంది. అయితే బాబు మోదీని పొగడ్తలతో ముంచెత్తడానికి కారణం రాబోయే ఎన్నికల్లో పొత్తుకోసమేనని ఏపీ బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated On 25 April 2023 8:00 AM GMT
Ehatv

Ehatv

Next Story