Chandrababu : సమావేశం గంటసేపా? అరగంటపాటా? దేన్ని నమ్మాలి?
తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu) ఢిల్లీకి(Delhi) ఎందుకు వెళ్లారో? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను(Amit shah) ఎందుకు కలిశారో టీడీపీ అనుకూల మీడియాకు కూడా తెలియనట్టుగా ఉంది. అందుకో తలో తీరుగా రాసేశాయి. ఎప్పుడూ చంద్రబాబుకు జాకీలు వేసే పనిలో ఉండే టీడీపీ అనుకూల మీడియా ఈసారి చంద్రబాబును మరింత భజన చేశాయి. టీడీపీతో పొత్తు కోసం బీజేపీ వెంపర్లాడుతోందని చెప్పాయి.
తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu) ఢిల్లీకి(Delhi) ఎందుకు వెళ్లారో? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను(Amit shah) ఎందుకు కలిశారో టీడీపీ అనుకూల మీడియాకు కూడా తెలియనట్టుగా ఉంది. అందుకో తలో తీరుగా రాసేశాయి. ఎప్పుడూ చంద్రబాబుకు జాకీలు వేసే పనిలో ఉండే టీడీపీ అనుకూల మీడియా ఈసారి చంద్రబాబును మరింత భజన చేశాయి. టీడీపీతో పొత్తు కోసం బీజేపీ వెంపర్లాడుతోందని చెప్పాయి. అమిత్ షా పిలిస్తేనే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు తప్ప తనంతటతానుగా ఢిల్లీకి వెళ్లలేదని రాసుకొచ్చాయి. రాత్రి 11.25 గంటలకు అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో(JP Nadda) చంద్రబాబు సమావేశమయ్యారని ఈనాడు రాసుకొచ్చింది. అమిత్ షా నివాసంలోనే ఈ ముగ్గురూ కూర్చొని రాజకీయపరిస్థితుల గురించి ముచ్చటించుకున్నారట! ఎన్డీయే భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తును ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీడీపీని కూడా ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించడానికి బీజేపీ పెద్దలు చంద్రబాబుతో సమావేశమయ్యారంటూ ఈనాడు చెప్పింది. వీరి భేటి 11.25 గంటలకు మొదలయ్యి 12.16 గంటలకు ముగిసిందట. ఇక ఆంధ్రజ్యోతి అయితే మరింత పంపు కొట్టింది. ఎన్డీయేను బలపరచండి. దేశం బలోపేతం కావడమే తమ లక్ష్యమని అమిత్ షా చంద్రబాబును బతిమాలినంత పని చేశారట! చంద్రబాబుతో పొత్తు చర్చలు జరిపాడట! గంటపాటు భేటి జరగిందట! బీజేపీ-టీడీపీ పొత్తు కుదిరితే బీజేపీ గెలిచే అవకాశాలున్న సీట్ల గురించి కూడా అమిత్ షా ఆరా తీశారట! గతంలో ఎన్డీయేను బలోపేతం చేసినట్టుగానే (ఎన్డీయేను టీడీపీ బలోపేతం చేసిందా? )ఇప్పుడూ సహకరించాలని చంద్రబాబును అమిత్ షా కోరారట! ఏపీలో జగన్ వ్యతిరేకపవనాలు వీస్తున్నాయని తమకు సమాచారం అందిందని చంద్రబాబుతో అమిత్ షా చెప్పారట! మొత్తానికి టీడీపీ అనుకూల మీడియా చెప్పదలచుకున్నదేమిటంటే బీజేపీ అవసరం టీడీపీకి లేదనీ, బీజేపీకే టీడీపీ అవసరం ఉందని! అంటే టీడీపీ పొత్తు కోసం బీజేపీ అధినాయకత్వం తహతహలాడుతున్నదన్నది సారాంశం!