తెలుగుదేశంపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును(Chandrababu) చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని అంటుంటారు. సిగ్గుపడడం కాదు, ఉరేసుకుని చచ్చిపోతుంది! నిన్న చిలకలూరిపేట ప్రజాగళం బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగం విన్నవారు కూడా ఏమిటీ వైపరీత్యం అని అనుకున్నారు. అసహనంతో ఊగిపోయారు. కాసింత జాలి, కాసింత కోపం కలిగే ఉంటాయి. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉందని పదే పదే చెప్పుకుంటారు చంద్రబాబు.

తెలుగుదేశంపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును(Chandrababu) చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని అంటుంటారు. సిగ్గుపడడం కాదు, ఉరేసుకుని చచ్చిపోతుంది! నిన్న చిలకలూరిపేట ప్రజాగళం బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగం విన్నవారు కూడా ఏమిటీ వైపరీత్యం అని అనుకున్నారు. అసహనంతో ఊగిపోయారు. కాసింత జాలి, కాసింత కోపం కలిగే ఉంటాయి. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉందని పదే పదే చెప్పుకుంటారు చంద్రబాబు. సుమారు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. సుదీర్ఘకాలం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన (తిప్పారని టీడీపీ అనుకూల మీడియా చెబుతూ ఉంటుంది. అందులో నిజమెంతో వారికి తప్ప ఎవరికీ తెలియదు) చంద్రబాబుకు ఇంతటి దయనీయ పరిస్థితి వస్తుందని ఊహించి ఉండరు. తన నోటితో నరేంద్ర మోదీని పొగడాల్సి వస్తుందని చంద్రబాబు కలలో కూడా అనుకోని ఉండరు. మామూలుగా లేదు చంద్రబాబు భజన! సభలో చంద్రబాబు 16 నిమిషాల పాటు ప్రసంగించారు.

ఇందులో సుమారు పది నిమిషాల పాటు నరేంద్రమోదీని పొగడటానికే సరిపోయింది. పైగా తెలుగులో రాసుకొచ్చిన హిందీ వ్యాఖ్యలను ఎలాంటి వాహభావాలు లేకుండా మాట్లాడటం మరో దరిద్రం. ఇప్పుడు మోదీని కీర్తించడం బాబుకు అవసరం. ఏడున్నర దశాబ్దాల వయసున్న చంద్రబాబుకు భవిష్యత్తు పట్ల ఓ రకమైన భయం, బెంగ ఉన్నాయి. అందుకే మోదీని అంతలా భజన చేయాల్సి వచ్చింది. ఇంతకు ముందు ప్రధాని మోదీని ఉగ్రవాది అని తిట్టారు బాబు. భార్యను కూడా చూసుకోలేనివాడు ప్రజలను ఎలా చూసుకుంటాని ఘాటుగా విమర్శించారు. ఇంచుమించు అయిదేళ్ల కిందట ఇదే చంద్రబాబు ఇదే మోదీని ఉగ్రవాది అని అన్నారు. ఇప్పుడు అదే మోదీని అదే చంద్రబాబు ప్రగతివాది అని అంటున్నారు. తనపట్ల మోదీకున్న కోపాన్ని చల్లార్చేందుకే చంద్రబాబు ఈ సభను వాడుకున్నారేమోనన్న అనుమానం కూడా వస్తుంది.

చంద్రబాబుకు పొగడ్తలకు మోదీ ప్రసన్నులయ్యారా అంటే అదేమీ లేదు. మోదీ ఒక వ్యక్తి కాదని, భారతదేశాన్ని విశ్వ గురువుగా మారుస్తున్న ఒక శక్తి అని చంద్రబాబు శ్లాఘించారు. మోదీ అంటే సంక్షేమం. మోదీ అంటే అభివృద్ధి. మోదీ అంటే సంస్క‌ర‌ణ‌. మోదీ అంటే భ‌విష్య‌త్తు. మోదీ అంటే ఆత్మ‌గౌర‌వం, ఆత్మ‌విశ్వాసం. ప్ర‌పంచం మెచ్చిన మేటైన నాయ‌కుడు మ‌న న‌రేంద్ర మోదీ. ప్ర‌ధాన‌మంత్రి అన్నా యోజ‌న‌, ఆవాస్ యోజ‌న‌, ఉజ్వ‌ల యోజ‌న‌, కిసాన్ స‌మ్మాన్ నిధి, పీఎం ఆయుష్మాన్ భార‌త్‌, జ‌ల్‌జీవ‌న్ లాంటి ప‌థ‌కాల‌తో సంక్షేమానికి కొత్త నిర్వ‌చ‌నం చెప్పిన వ్య‌క్తి మోదీ. సంప‌ద సృష్టించిన వ్య‌క్తి మోదీ. పెద్ద నోట్ల ర‌ద్దు, జీఎస్టీ లాంటి సంస్క‌ర‌ణ‌ల‌తో దేశ ముఖ చిత్రాన్ని మార్చిన వ్య‌క్తి మోదీ.. ఇలా చాలా చాలా అన్నారు. బహుశా బీజేపీ వారు కూడా మోదీని ఇంతలా పొగడరేమో! ఆయన క్రమశిక్షణను మీరు నేర్చుకోవాలని ప్రజలకు హితవు చెప్పారు. మీటింగ్‌కు వచ్చిన కొందరు టవర్స్‌ ఎక్కారు. వారిని తాము ఎవరమూ నివారించలేకపోయామని, ప్రధానిగా ముందు చూపుతో ప్రమాదం జరుగుతుందని గ్రహించారని చంద్రబాబు చెబుతూ ఔనా? కాదా! అని మిమ్మల్ని అడుగుతున్నా అంటూ సభకు వచ్చిన వారిని అడిగారు.

నరేంద్ర మోదీకి(Narendra modi) స్వాగ‌తం ప‌ల‌క‌డం అంటే రాష్ట్రంలో ఇళ్ల‌లో ఉన్న‌వారికి కూడా విన‌ప‌డేలా గ‌ట్టిగా చ‌ప్ప‌ట్లు కొట్టాలి అంటూ చంద్రబాబు చెప్పినా జనం నుంచి పెద్దగా స్పందన రాలేదు. అక్కడితో ఆగలేదు బాబుగారు.. ఆయన వాక్‌ప్రవాహం కొనసాగింది. 'ప్ర‌ధాని నినాదం సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్. వీటితో దేశానికి న‌మ్మ‌కాన్ని క‌లిగించిన శ‌క్తిమంతమైన నాయ‌కుడు న‌రేంద్ర మోదీ. కోవిడ్ స‌మ‌యంలో ప్ర‌పంచంలో ఎవ‌రూ చేయ‌ని విధంగా స‌మ‌య స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి మ‌న ప్రాణాల్ని కాపాడిన వ్య‌క్తి మోదీ. ఔనంటే గ‌ట్టిగా చ‌ప్ప‌ట్లు అభినందించండి.వంద దేశాల‌కి వ్యాక్సిన్ ఇచ్చి, దేశ స‌మ‌ర్థ‌త‌ని చాటి చెప్పిన వ్య‌క్తి. అమెరికా, చైనా దేశాల‌కు దీటుగా మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ని తీసుకొచ్చే శ‌క్తి, సామ‌ర్థ్యం మోదీకి ఉన్నాయి. పేద‌రికం లేని దేశం మోదీ క‌ల‌, ఆయ‌న సంక‌ల్పం. పేద‌రికం లేని రాష్ట్రం చేయ‌డం మ‌న క‌ల‌. అందుకే ఆయ‌న ఆశ‌యాల‌తో అనుసంధానం కావాల్సిన అవ‌స‌రం వుంది. ప్ర‌పంచంలోనే భార‌తదేశానికి గుర్తింపు తెచ్చిన వ్య‌క్తి న‌రేంద్ర మోదీ. ప్ర‌పంచంలోనే భార‌తదేశాన్ని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దే శ‌క్తి, సామ‌ర్థ్యం ఒక్క న‌రేంద్ర మోదీకే ఉన్నాయి. అంతేకాదు, భార‌తీయులు మొత్తం ప్ర‌పంచంలో ఒక శ‌క్తివంత‌మైన జాతిగా త‌యారు చేయ‌డం ఆయ‌న ఆశ‌యం. ఇప్ప‌టికే జ‌రుగుతా వుంది. భ‌విష్య‌త్‌లో ఈ దేశాన్ని పేద‌రికం లేకుండా త‌యారు చేసే శ‌క్తి కూడా ఆయ‌న‌కే ఉంది' అంటూ చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. జల్లు కాదు, ఏకంగా వర్షాన్నే కురిపించారు. పాపం మోదీకి తెలుగు రాదు కాబట్టి నిమ్మళంగా ఉన్నారు. లేకపోతే చంద్రబాబు పొగడ్తలకు మోదీ కూడా తెగ సిగ్గుపడి ఉండేవారు. నిన్న చంద్రబాబు మాట్లాడిన మాటలు విన్నవారికి ఎవరికైనా ఆయన ఎంత భయపడుతున్నారో అర్థమవుతుంది. మొత్తంగా నిన్నటి ప్రజాగళం బహిరంగసభ ఎన్నికల శంఖారావంలా లేదు. అది నరేంద్ర మోదీకి భజన చేయడానికే పెట్టినట్టు ఉంది.

Updated On 18 March 2024 4:45 AM GMT
Ehatv

Ehatv

Next Story