ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న గట్టి పట్టుదలతో టీడీపీ(TDP)-జనసేన(Janasena) కూటమి ఉంది. పొత్తు అయితే కుదిరింది కానీ సీట్ల సర్దుబాటే ఆలస్యమవుతోంది. బీజేపీ(BJP) నిర్ణయం కోసం రెండు పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఇక ఈ రోజు విజయవాడలో(Vijayawada) టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ కీలక సమావేశం జరగబోతున్నది.

ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న గట్టి పట్టుదలతో టీడీపీ(TDP)-జనసేన(Janasena) కూటమి ఉంది. పొత్తు అయితే కుదిరింది కానీ సీట్ల సర్దుబాటే ఆలస్యమవుతోంది. బీజేపీ(BJP) నిర్ణయం కోసం రెండు పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఇక ఈ రోజు విజయవాడలో(Vijayawada) టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ కీలక సమావేశం జరగబోతున్నది. ఈ సమావేశానికి తెలుగుదేశంపార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ చీఫ్‌ అచ్చెన్నాయుడు(Achchennaidu), యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవులు, నిమ్మల రామానాయుడు, తంగిరాల సౌమ్య పాల్గొంటారు. జనసేన తరఫున నాదెండ్ల మనోహర్‌(Nadendla manohar), కందుల దుర్గేశ్‌(Kandhula durgesh), బొమ్మిడి నాయకర్‌, గోవిందరావు, యశస్విని హాజరవుతారు. క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం, ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే, జిల్లాల్లో ప్రచార వ్యూహాల రూట్ మ్యాప్ పైనా కూడా ఈ భేటీలో మాట్లాడతారు. సీట్ల సర్దుబాటు ఆలస్యం అవుతుండటంతో కార్యకర్తలు అసహనానికి లోనవుతున్నారు. ప్రస్తుతానికి ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో తెలియని గందరగోళం నెలకొంది.

Updated On 22 Feb 2024 1:44 AM GMT
Ehatv

Ehatv

Next Story