ప్రైవేట్ రంగ దిగ్గజం, ఐటీ కంపెనీ(IT company) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS)లో ఉద్యోగ నియామ‌కాల పేరిట‌ రూ.100 కోట్లు లంచం తీసుకున్నట్లు వెల్లడైంది. టీసీఎస్ మూడేళ్లలో ఏటా దాదాపు 50 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఉద్యోగాల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ విషయం తెరపైకి వచ్చింది. విచారణ అనంతరం నలుగురు అధికారులను విధుల నుంచి తప్పించారు.

ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులు ఎప్పటికప్పుడు అందుతున్నాయని, వాటిని దర్యాప్తు చేసి పరిష్కరించడానికి కంపెనీ పటిష్టమైన ప్రక్రియలను కలిగి ఉందని టీసీఎస్ ప్రతినిధి(TCS representative) శుక్రవారం తెలిపారు. కంపెనీ ప్రతినిధి ప్రకారం.. కొంతమంది సీనియర్ అధికారులు.. నియామకానికి బదులుగా సిబ్బంది సంస్థల నుండి కిక్‌బ్యాక్ తీసుకున్నట్లు కంపెనీ తన దర్యాప్తులో కనుగొంది. నియామక ప్రక్రియలో రాజీ పడ్డార‌ని క‌నుగొంద‌ని వెల్ల‌డించారు.

కంపెనీ రిక్రూట్‌మెంట్ విభాగంలో టీసీఎస్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (RMG) గ్లోబల్ హెడ్ అయిన ఈఎస్‌ చక్రవర్తి సిబ్బంది సంస్థల నుండి కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO).. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌కి ఒక విజిల్‌బ్లోయర్ సందేశం పంపారు. ఈ ఫిర్యాదును అనుసరించి, ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ అజిత్ మీనన్‌తో సహా ముగ్గురు అధికారుల బృందాన్ని కంపెనీ వెంటనే ఏర్పాటు చేసింది.

సమాచారం ప్రకారం.. టీసీఎస్ కొన్ని వారాల విచారణ తర్వాత రిక్రూట్‌మెంట్ హెడ్‌ను సెలవుపై పంపింది. నలుగురు RMG అధికారులను తొలగించడంతో పాటు మూడు సిబ్బంది సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేసింది. అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో కంపెనీ ఇంకా నిర్ధారించనప్పటికీ, ఈ కుంభకోణానికి పాల్పడిన వారు కమీషన్ రూపంలో కనీసం రూ.100 కోట్లు సంపాదించి ఉంటారని అంచనా.

Updated On 23 Jun 2023 6:04 AM GMT
Ehatv

Ehatv

Next Story