✕
గుజరాత్‌లోని(Gujarat) సురేంద్రనగర్(Surendra Nagar) జిల్లాకు వెళ్లేందుకు పర్యాటకులు బ్యాగులు సర్దేసుకుంటున్నారు.. ఎందుకంటే ఆ జిల్లాలోని తార్నేతార్లో(Tarnetar) ఓ బ్రహ్మాండమైన మేళా(Mela) జరగబోతున్నది కాబట్టి! అసలు ఇలాంటి మేళా మరెక్కడా జరగదు కాబట్టి! సంప్రదాయాల పరిమళాలు వ్యాపిస్తాయి కాబట్టి! ఆసక్తికరమైన ఘట్టాలు ఆవిష్కృతమవుతాయి కాబట్టి! తార్నేతార్ మేళా(Tarnetar Mela) తీరుతెన్నులపై మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.

x
Tarnetar Mela At Gujarat
-
- గుజరాత్‌లోని(Gujarat) సురేంద్రనగర్(Surendra Nagar) జిల్లాకు వెళ్లేందుకు పర్యాటకులు బ్యాగులు సర్దేసుకుంటున్నారు.. ఎందుకంటే ఆ జిల్లాలోని తార్నేతార్లో(Tarnetar) ఓ బ్రహ్మాండమైన మేళా(Mela) జరగబోతున్నది కాబట్టి! అసలు ఇలాంటి మేళా మరెక్కడా జరగదు కాబట్టి! సంప్రదాయాల పరిమళాలు వ్యాపిస్తాయి కాబట్టి! ఆసక్తికరమైన ఘట్టాలు ఆవిష్కృతమవుతాయి కాబట్టి! తార్నేతార్ మేళా(Tarnetar Mela) తీరుతెన్నులపై మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి. మనకు మేళాలు కొత్త కాదు. ఏడాది పొడవునా ఎక్కడో చోట లోక్మేళాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గిరిజనులు జరుపుకునే సాంస్కృతిక మేళాలకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. గుజరాత్లో ప్రతి ఏడాది జరిగే తార్నేతార్ మేళా ఈ కోవలోకే వస్తుంది.
-
- వారి క్యాలెండర్ ప్రకారం భాదర్వశుద్ మాసంలో జరిగే తార్నేతార్ మేళాను వీక్షించడం గొప్ప అనుభూతి.. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే ఈ మేళా మూడు రోజులపాటు వైభవంగా కొనసాగుతుంది. సురేంద్రనగర్ జిల్లాలో ఉన్న తార్నేతర్ గ్రామంలోనే ఈ లోక్మేళా జరుగుతుంది. థాంగధ్ పట్టణానికి దగ్గరలో ఉందీ గ్రామం. రాజ్‌కోట్‌కు 90 కిలోమీటర్ల దూరం! గుజరాతీ జనపదాలను.ఆదివాసీల సంస్కృతీ- సాంప్రదాయాలను ఆస్వాదించి ఆనందించాలంటే తార్నేతర్ కంటే గొప్ప వేడుక మరొకటి ఉండదు. ఈ మేళాలో సంగీత- నృత్యాలు, ఆటపాటలు, సంప్రదాయ వస్త్రధారణలు ఇంకా ఎన్నో కళారూపాలు కనువిందు చేస్తాయి. ఏ యేటికి ఆ యేడు ఈ ఉత్సవం సరికొత్త శోభను సంతరించుకుంటోంది.
-
- దాంతో పాటే పర్యాటకులు పెరుగుతూ వస్తున్నారు. రెండు లక్షలకు పైగానే జనం ఈ వేడుకలో పాల్గొంటారు.. మహాభారతం(Maha Bharat) నాటి ద్రౌపది(Draupadi) స్వయంవరంతో తార్నేతర్ మేళా ముడిపడి ఉంది.. అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని మనువాడిన ఘట్టాన్ని స్మరించుకుంటూ ఇక్కడి ఆదివాసీలు ఈ వేదిక ద్వారా స్వయంవరం ప్రకటించుకుంటారు. రెండున్నర శతాబ్దాల కిందట ఈ మేళాకు అంకురార్పణ జరిగిందని చరిత్ర చెబుతోంది. త్రినితేశ్వర్ మహాదేవ్ ఆలయం పరిసరాల్లోనే తార్నేతర్ సమ్మేళనం జరగుతుంటుంది. ఆలయ ప్రాంగణంలో ఓ జలాశయం ఉంది.
-
- పవిత్ర గంగానది జన్మస్థానం ఇదేనని భావిస్తారు స్థానికులు. ఆ పుష్కరిణిలో మునిగితే సర్వ పాపాలు తొలగిపోతాయన్నది స్థానికుల ప్రగాఢ నమ్మకం. గంగలో(Ganga) మునిగినంత పుణ్యం వస్తుందని వారు విశ్వసిస్తారు. కోలిస్ అనే తెగ ప్రజలకు ఇది అపూర్వమైన ఉత్సవం. వారే ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణ..! వారి స్వయంవరానికి తార్నేతర్ మేళానే వేదిక! పెళ్లికాని అబ్బాయిలంతా తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఇదో మంచి సందర్భం. గొడుగులకు అందమైన ఎంబ్రాయిడరీలను అద్దుతారు. వారు కేవలం చేతులతో తయారుచేసిన గొడుగులను చూస్తే ఛత్రీలు కూడా ఇంత అందంగా ఉంటాయా అనిపిస్తుంది.
-
- ఇదంతా అమ్మాయిలను ఆకర్షించడానికే సుమా! గొడుగు చివరన రంగురంగుల రుమాళ్లను అతికిస్తారు. ఏడాది పొడవునా పాపం, ఈ గొడుగు తయారుచేస్తూనే ఉంటారు. రంగులు అద్దుతూనే ఉంటారు.. ఆ గొడుగును చేత్తో పుచ్చుకునే అమ్మాయిలతో పెళ్లి ప్రతిపాదన తెస్తారు. మేళా ముగిసే సమయానికి నచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు లేదా అమ్మాయి తరఫు పెద్దలు వచ్చి పెళ్లి ముచ్చట్లు చేసుకుంటారు.. ఇక గొడుగులతో వారు చేసే నృత్యాలు మేళాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.. అప్పట్లో వీరు చేసిన గొడుగుల డాన్స్ గిన్నిస్ రికార్డ్స్ బుక్కులో కూడా ఎక్కింది.. గ్రామీణులు ప్రదర్శించే స్టంట్స్ ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తాయి.

Ehatv
Next Story