దేశంలో మతోన్మాద విధానాలు పారాకాష్టకు చేరాయని సీపీఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram) అన్నారు. సీపీఎం నిరసన ర్యాలీ(Rally)లో ఆయన ప్రసంగిస్తూ.. దేశ వ్యాప్తంగా బీజేపీ(BJP) నియంతృత్వ నిర్బంధాలు విధిస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.

Tammineni Veerabhadram
దేశంలో మతోన్మాద విధానాలు పారాకాష్టకు చేరాయని సీపీఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram) అన్నారు. సీపీఎం నిరసన ర్యాలీ(Rally)లో ఆయన ప్రసంగిస్తూ.. దేశ వ్యాప్తంగా బీజేపీ(BJP) నియంతృత్వ నిర్బంధాలు విధిస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. సీఎం కేసీఆర్(KCR)ను ఇబ్బంది పెట్టేందుకు కవితపై(Kavitha) కేసులు పెట్టారని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయులకు ప్రతిష్టలు తీసుకొచ్చి బంగారు పతకాలు తీసుకొచ్చిన రెజ్లర్లను లైంగికంగా వేధించిన.. బ్రిజ్ భూషణ్ శరణ్(Brij Bhushan Sharan) పై చర్యలపై మోదీ(Modi) స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
కేరళ(Kerala) రాష్ట్రాన్ని బదనాం చేయడం కోసం.. కేరళ స్టోరీ(The kerala story) మూవీ తీసుకొచ్చారని.. ఇలాంటి సినిమాలు తీసుకొస్తామని బండి సంజయ్ అనడానికి సిగ్గుండాలన్నారు. మతాన్ని అనుసరించి.. సినిమాలు తీస్తూ రాజకీయాలు చేయడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చాలా దుర్మార్గమైనదన్నారు. 9,000 మంది ఉన్న జేపీఎస్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని హామీని వదిలేశారని అన్నారు. తమ సమస్యలపై చర్చించేందుకు.. లేఖ రాసిన అపాయింట్మెంట్ అడిగినా, స్పందించకపోవడం దారుణమన్నారు. జేపీఎస్ సమ్మెపై ప్రభుత్వ వైఖరిని సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
