ఓ వ్యక్తికి తన కూతురును ఇచ్చి పెళ్లి చేసింది ఓ మహిళ. అల్లుడికి తన ఇంటిలోనే ఆశ్రయం కల్పించింది కూడా. కానీ అతని కన్ను ఆమె చిన్నకూతురుపై పడింది.

ఓ వ్యక్తికి తన కూతురును ఇచ్చి పెళ్లి చేసింది ఓ మహిళ. అల్లుడికి తన ఇంటిలోనే ఆశ్రయం కల్పించింది కూడా. కానీ అతని కన్ను ఆమె చిన్నకూతురుపై పడింది. మైనర్‌ బాలికపై పలు మార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోర్టు అతనికి జీవితఖైదు శిక్ష విధించడంతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నై ఆండాల్‌ నగర్‌కు చెందిన బికారీ నాయక్‌ కుమారుడు రాజ్‌కుమార్‌ నాయక్‌ (35), అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అత్తారింటిలోనే ఉంటూ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రాజ్‌కుమార్‌ నాయక్.. అతని భార్య సోదరి ప్రియదర్శిని(17)నిపై కన్నేశాడు. బలవంతంగా పలుమార్లు శారీరకంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ప్రియదర్శిని గర్భవతి కావడంతో బాధితురాలు ఎన్నూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2018లో కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. కేసు విచారణ తిరువళ్లూరు కోర్టులో సాగింది. విచారణలో ప్రియదర్శినిపై బలవంతంగా నిందితుడు పలుమార్లు అత్యాచారం చేసినట్టు నిర్ధారణ కావడంతో నిందితుడికి జీవిత ఖైదు శిక్షతో పాటూ లక్ష రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు. జరిమానా చెల్లించని పక్షంలో నిందితుడు మరో మూడు సంవత్సరాల పాటూ అదనంగా శిక్షను అనుభవించాలని న్యాయమూర్తి ఆదేశించిన నేపథ్యంలో నిందితుడిని పుళల్‌ జైలుకు తరలించారు.

ehatv

ehatv

Next Story