అయోధ్యలో(Ayodhya) బాలరాముడి ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరుగుతోంది. దేశ, విదేశాల నుంచి ప్రముఖులు ఈ అమోఘ ఘట్టంలో పాల్గొనేందుకు వేలాదిగా తరలివస్తున్నారు. దేశమంతా రామనామ జపం జరుగుతోంది.
అయోధ్యలో(Ayodhya) బాలరాముడి ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరుగుతోంది. దేశ, విదేశాల నుంచి ప్రముఖులు ఈ అమోఘ ఘట్టంలో పాల్గొనేందుకు వేలాదిగా తరలివస్తున్నారు. దేశమంతా రామనామ జపం జరుగుతోంది. దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ఇళ్ల ముందు ముగ్గులు, దర్వాజలకు మామిడి తోరణాలు, ఇళ్లలో పూజలు సైతం నిర్వహిస్తున్నారు. రామాలయాల్లో ప్రత్యేక హోమాలు, పూజలు, కల్యాణాలు నిర్వహిస్తున్నారు. దశాబ్దాలుగా పోరాడి నిర్మితమైన రామమందిరంలో(Ram mandir) ప్రాణప్రతిష్ట జరుగుతోంది.
అయితే అందుకు భిన్నంగా తమిళనాడులో(Tamilnadu) కొందరు #JaiRavanaFromTamilnadu అనే హ్యాష్‌ట్యాంగ్ ట్రెండింగ్ చేస్తున్నారు. రాముడి కంటే రావణుడే గొప్పవాడని కీర్తిస్తున్నారు. రావణుడికి మద్దతుగా ట్విట్లు(Tweet) చేస్తున్నారు. దీనిపై ఇది రెచ్చగొట్టినట్లేనని, పవిత్రమైన రోజును ఇలాంటి పనులు సరికావని, తమ మనోభావాలను కించపరిచేలా కొందరు ఇలా ప్రవర్తిస్తున్నారని రామభక్తులు మండిపడతున్నారు. ఇలా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.