సీఎం ఎంకే స్టాలిన్(CM MK stalin) అమెరికా(America) పర్యటనలో ఉన్నారు.
సీఎం ఎంకే స్టాలిన్(CM MK stalin) అమెరికా(America) పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను(Investments) ఆకర్శించే లక్ష్యంతో ఈ పర్యటన సాగుతుంది. ఈ క్రమంలోనే నోకియా(Nokia), పేపాల్(Paypal), మైక్రోచిప్(Microchip), ఈల్డ్ ఇంజినీరింగ్ సిస్టమ్స్ సహా పలు పారిశ్రామిక సంస్థలతో పెట్టుబడులకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పరిశ్రమల మంత్రి టిఆర్‌బి రాజా సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి ప్రోత్సాహక సంస్థ గైడెన్స్ తమిళనాడు సంతకం చేసింది.
ఒప్పందం ప్రకారం.. నోకియా తమిళనాడులో రూ. 450 కోట్లతో కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 100 ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. పేపాల్ చెన్నైలో అడ్వాన్స్‌డ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుండగా.. ఈ సెంటర్ ద్వారా 1000 ఉద్యోగాల కల్పన జరుగనుంది.
మైక్రోచిప్ చెన్నైలోని సెమ్మంచేరిలో సెమీకండక్టర్ టెక్నాలజీలో రూ. 250 కోట్లతో 1,500 ఉద్యోగాలను సృష్టించే కొత్త పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.
కోయంబత్తూర్‌లోని సూలూర్‌లో 300 మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రూ.150 కోట్లతో సెమీకండక్టర్ పరికరాల ఉత్పత్తి, తయారీ కేంద్రాన్ని ఈల్డ్ ఇంజినీరింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి పరిశ్రమల మంత్రి టిఆర్‌బి రాజా, సీఎంవో అధికారులు పూర్తి వివరాలను అధికారిక ఎక్స్ ఖాతాల ద్వారా వెల్లడించారు.