తమిళనాడు(Tamilnadu) రాష్ట్రం సేలం జిల్లాలోని ఇద్దరు దళిత రైతులకు(Farmers) 2023 జులైలో ఓ కవర్‌ అందింది. అదేంటో తెలియక ఆ రైతులు తికమకపడ్డారు. కవర్‌ తెరిచి చూడగా అందులో ఈడీ నోటీసులు(ED Notices) కనిపించాయి. మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని రైతు సోదరులు కణ్ణనియన్(Kannanian) (72), కృష్ణన్‌(Krishnan) (62)కు ఈడీ నోటీసులు పంపించింది. తీరా వారి బ్యాంకు ఖాతాలో చూస్తే కేవలం 450 రూపాయలే ఉన్నాయి.

దీనిపై రైతుల తరపున వాదిస్తున్న లాయర్‌ ప్రవీణ ఈడీ నోటీసులపై స్పందించింది. కేవలం 450 రూపాయలతో మనీలాండరింగ్‌కు(money laundering) ఎలా పాల్పడుతారని ప్రశ్నించింది. దీని వెనుక బీజేపీ(BJP) కుట్ర ఉందని ఆమె ఆరోపణలు చేసింది. రైతులు కణ్ణనియన్, కృష్ణన్‌కు సేలం జిల్లాలో ఆరున్నర ఎకరాల పొలం ఉంది. దానిపై బీజేపీ సీనియర్‌ నేత గుణశేఖర్‌(Gunashekar) కన్నుపడిందని ఆమె అన్నారు. ఈ క్రమంలోనే రైతుల పొలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా.. వారు అతనిపై ఫిర్యాదు కూడా చేశారని తెలిపింది. గత కొంత కాలంగా ఈ పొలంపై వివాదం కొనసాగుతుందని ఈ క్రమంలోనే మనీలాండరింగ్‌ నోటీసులు వచ్చాయని న్యాయవాది ప్రవీణ చెప్తున్నారు.

Updated On 5 Jan 2024 6:08 AM GMT
Ehatv

Ehatv

Next Story