లోక్‌సభ ఎన్నికలకు(Lok Sabha Election) దగ్గరపడుతుండటంతో రాజకీయపార్టీలు వ్యూహారచనలో, మేనిఫెస్టో కల్పనలో బిజీ అయ్యాయి. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్(MK Stalin) లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులను(Candidates) ప్రకటిస్తూనే తమ పార్టీ మేనిఫెస్టోని(Manifesto) విడుదల చేశారు. నీట్‌ పరీక్షలపై నిషేధం, రాష్ట్రంలో టోల్‌గేట్ల తొలగింపు, రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై నిషేధం, ఎల్పీజీ గ్యాస్‌ -500, లీటర్‌ పెట్రోల్‌ పై రూ.75, డీజిల్‌- రూ. 65 అందిస్తూ నిర్ణయం డీఎంకే ఎన్నికల ప్రణాళికలోని కీలక అంశాలు.

లోక్‌సభ ఎన్నికలకు(Lok Sabha Election) దగ్గరపడుతుండటంతో రాజకీయపార్టీలు వ్యూహారచనలో, మేనిఫెస్టో కల్పనలో బిజీ అయ్యాయి. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్(MK Stalin) లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులను(Candidates) ప్రకటిస్తూనే తమ పార్టీ మేనిఫెస్టోని(Manifesto) విడుదల చేశారు. నీట్‌ పరీక్షలపై నిషేధం, రాష్ట్రంలో టోల్‌గేట్ల తొలగింపు, రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై నిషేధం, ఎల్పీజీ గ్యాస్‌ -500, లీటర్‌ పెట్రోల్‌ పై రూ.75, డీజిల్‌- రూ. 65 అందిస్తూ నిర్ణయం డీఎంకే ఎన్నికల ప్రణాళికలోని కీలక అంశాలు. ముఖ్యమంత్రికి గవర్నర్‌ను నియమించే అధికారం, గవర్నర్‌లకు క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ నుంచి మినహాయింపునిచ్చే ఆర్టికల్‌ 361 సవరణ వంటి అంశాలను కూడా మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోను రూపొందించినందుకు స్టాలిన్‌ తన సోదరి కనిమొళిని ప్రశంసించారు.
డీఎంకే మేనిఫెస్టోలని ప్రధాన అంశాలు :
1.రాష్ట్రాలకు సమాఖ్య హక్కులు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ.
2.చెన్నైలోని సుప్రీం కోర్టు బెంచ్‌ ఏర్పాటు
3.పుదుచ్చేరికి రాష్ట్ర హోదా
4.జాతీయ విద్యా విధానం (NEP) ఉపసంహణ
5.మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు
6.ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్ధులకు ఉదయం అల్పాహారం సదుపాయం.
7.నీట్‌ బ్యాన్‌.
8.రాష్ట్రంలో టోల్‌ గేట్ల తొలగింపు
9.రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై నిషేధం
10.ఎల్పీజీ గ్యాస్‌ -500, లీటర్‌ పెట్రోల్‌ పై రూ.75, డీజిల్‌- రూ. 65 అందిస్తూ నిర్ణయం
11.తిరుకురల్‌ను ‘నేషనల్‌ బుక్‌’ గా తీర్చిదిద్దుతాం
12.భారత్‌కు తిరిగి వచ్చిన శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం
13.గవర్నర్‌లకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుండి మినహాయింపునిచ్చే ఆర్టికల్ 361 సవరణ
14.కొత్త ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈ, ఐఐఏఆర్‌ఐలు ఏర్పాటుతో పాటు ఇతర హామీలు నెరవేర్చేలా మేనిఫెస్టోని సిద్ధం చేసింది డీఎంకే.

Updated On 20 March 2024 5:09 AM GMT
Ehatv

Ehatv

Next Story